Afghanistan: మహిళా యాంకర్ల కోసం మాస్కులతో మగ న్యూస్ రీడర్లు

అఫ్ఘానిస్తాన్ కొత్త పాలకుల ఆదేశాల ప్రకారం.. మహిళా న్యూస్ రీడర్లు కళ్లు మాత్రమే కనిపించే వస్త్రధారణతో వార్తలు చదువుతున్నారు. ఇదిలా ఉంటే, అఫ్ఘాన్ మహిళల వేషధారణపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మగ న్యూస్ రీడర్లు మాస్కులు ధరించి వార్తల్లో కనిపించారు.

Afghanistan: మహిళా యాంకర్ల కోసం మాస్కులతో మగ న్యూస్ రీడర్లు

Taliban

 

 

Afghanistan: అఫ్ఘానిస్తాన్ కొత్త పాలకుల ఆదేశాల ప్రకారం.. మహిళా న్యూస్ రీడర్లు కళ్లు మాత్రమే కనిపించే వస్త్రధారణతో వార్తలు చదువుతున్నారు. ఇదిలా ఉంటే, అఫ్ఘాన్ మహిళల వేషధారణపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మగ న్యూస్ రీడర్లు మాస్కులు ధరించి వార్తల్లో కనిపించారు. మహిళల స్వేచ్ఛకు భంగం కలిగించే ఆంక్షలు విధించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

మగ యాంకర్లు చేసిన పనికి సోషల్ మీడియాలో #Freeherface అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. మాస్కులు ధరించిన వారి ఫొటోలను పోస్టు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు నెటిజన్లు.

మే నెలారంభంలో, మహిళలంతా బహిరంగంగా ఉన్నప్పుడు తల నుండి కాలి వరకు కవర్ అయ్యే దుస్తులు మాత్రమే ధరించాలని ఆదేశించింది తాలిబాన్ ప్రభుత్వం. మహిళలు అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్లను విడిచిపెట్టవచ్చు. ఒక మహిళ దుస్తుల కోడ్‌ను ఉల్లంఘిస్తే మగ బంధువులకు శిక్షలను భరించాల్సి వస్తుందని చెప్పింది. స్త్రీలు పాటించడానికి నిరాకరిస్తే పురుషులకు జైలు శిక్ష విధించవచ్చు.

Read Also : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ స‌ర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్‌ చదవాలని ఆదేశం

అఫ్ఘానిస్తాన్‌లో గతంలో తాలిబాన్ అధికారంలో ఉన్న సమయంలో, ఇతర పరిమితులతోపాటు, విద్యను నిరాకరించడం, ప్రజా జీవితంలో పలు అంశాలపై నిరోధించడం వంటి వాటిపై విపరీతమైన ఆంక్షలు విధించారు.