రైల్వే స్టేషన్లో శాండ్‌విచ్ తిన్నాడని అరెస్టు

రైల్వే స్టేషన్లో శాండ్‌విచ్ తిన్నాడని అరెస్టు

ఏ దొంగతనమో చేయలేదు. తినకూడనిది తినలేదు. సొంత డబ్బులతో కొనుక్కుని శాండ్‌విచ్ తిన్నాడని పోలీసులు అరెస్టు చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో రైలు ప్లాట్ ఫాం పక్కన కూర్చొని ఓ వ్యక్తి శాండ్‌విచ్ తింటున్నాడు. ఈలోగా అక్కడికి మెక్ కార్మిక్ అనే పోలీస్ వచ్చాడు. 

‘నువ్వు తినడం చట్ట వ్యతిరేకం అన్నాడు’ పేరెంటే చెప్పమంటే దానికి ఫొస్టర్ అనే వ్యక్తి నిరాకరించాడు. కాసేపు నడిచింది. దీని గురించి అధికారులు ఇలా తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తినకూడదని అన్ని స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేశాం. రవాణా వ్యవస్థ తినుబండారాల కారణంగా శుభ్రత లేకుండా తయారవుతుందని మా అభిప్రాయం. సోమవారం జరిగిన ఈ ఘటన ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. ఆ పోలీస్ అధికారి అతనిని తినొద్దని చెప్పినప్పడు ఆపేస్తే విషయం ఇక్కడ వరకూ వచ్చేది కాదని’ అధికారి తెలిపాడు.

ఆ వ్యక్తి తింటుండగా అధికారి అతనిని దాటుకుంటూ వెళ్లాడు. అప్పుడు తినొద్దని వారించాడు. కాసేపటికి మళ్లీ అతను తింటూనే ఉన్నాడు. నువ్వెవరని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఈ వ్యవహారం మొత్తంలో ఆఫీసర్ తప్పేమీ కనిపించడం లేదు. నియమాలకు అనుగుణంగానే ప్రవర్తించాడని’ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.