Mask పెట్టుకోవాలని అన్నందుకు అక్కడ కొరికాడు

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 10:40 AM IST
Mask పెట్టుకోవాలని అన్నందుకు అక్కడ కొరికాడు

Corona Virus వ్యాపిస్తున్న క్రమంలో Mask కంపల్సరీ అయ్యింది. ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా..బయటకు రావొద్దని పలు దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. మాస్క్ లు పెట్టుకుని బయటకు రావాలని సూచిస్తున్న వారితో కొంతమంది ఘర్షణలకు, వాగ్వాదానికి దిగుతున్నారు.



కొంతమంది అయితే..దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకెం చెబుతారా అంటూ ఫైటింగ్ కు దిగుతున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ ఘటన చోటు చేసుకుంది. ఐర్లాండ్ లోని బెల్జియం నివాసం ఉండే..రాబర్ట్ మర్ఫీ అనే వ్యక్తి..బస్సులో వెళుతున్నాడు. అదే బస్సులో కూర్చొన్న వ్యక్తి జలుబుతో బాధ పడుతున్నాడు. అతని చూసిన మర్ఫీ..మాస్క్ పెట్టుకోవాలని సూచించాడు.

వెంటనే అతను అర్థం చేసుకుని..సారీ చెప్పి మాస్క్ ధరించాడు. మరికాసేపటికి..అదే బస్సులో ఓ జంట ఎక్కింది. ఆ జంట వచ్చి మర్ఫీ ఎదుట కూర్చొన్నారు. యువకుడు మాస్క్ సరిగ్గా ధరించలేదు. దీంతో మాస్క్ కరెక్టుగా పెట్టుకోవాలని మర్ఫీ సూచించాడు. ఇదోదే నేరమయినట్లు…ఆ యువకుడు ఫీలయ్యాడు.



నువ్వెవ్వరు చెప్పడానికి అంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ యువకుడు మర్ఫీపై దాడికి దిగాడు. తన పళ్లతో మర్ఫీ ఛాతిపై గట్టిగా కొరికాడు.

అనంతరం ప్రేయసితో కలిసి బస్సులో నుంచి దిగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.