వీడెవడండి బాబూ.. అంకుల్ అస్థిపంజరంతో అల్లుడు గిటార్

వీడెవడండి బాబూ.. అంకుల్ అస్థిపంజరంతో అల్లుడు గిటార్

Man builds guitar out of his dead uncle’s skeleton: అమెరికాకి చెందిన ప్రిన్స్ మిడ్‌నైట్ అనే యువ‌కుడు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. కొంతమందిని అట్రాక్ట్ చేస్తే మరికొంతమందిని భయపెడుతోంది. ఇంకొంతమంది.. వీడెవడండి బాబూ..అని తల పట్టుకున్నారు. ఇంతకీ ప్రిన్స్ ఏం చేశాడో చెప్పలేదు కదూ.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటార్ తయారు చేశాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

మ్యాటర్ ఏంటంటే.. ప్రిన్స్ అంకుల్ ఫిలిఫ్ కొన్నేళ్ల క్రితం గ్రీస్ లో చ‌నిపోయాడు. ఫిలిఫ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఓ మెడిక‌ల్ కాలేజీకి ఇచ్చారు. చాలా మంది విద్యార్థులు ఆ మృత‌దేహంపై ప‌రిశోధనలు చేశారు. చివరికి డెడ్‌బాడీ బాగా కుళ్లిన స్థితికి చేరింది. దీంతో మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యం దాన్ని ఫిలిఫ్ డెడ్ బాడీని కుటుంబ స‌భ్యుల‌కు తిరిగి ఇచ్చేసింది.

ఆ మృతదేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. కానీ ప్రిన్స్ మిడ్‌నైట్ మాత్రం త‌న అంకుల్ ఆత్మ‌కు సరికొత్త‌గా శాంతి చేకూరాల‌నే సంక‌ల్పంతో వినూత్నంగా ఆలోచించాడు. అంతే, ఫిలిఫ్ అస్థిపంజ‌రంతో ఏకంగా గిటార్‌ను రూపొందించాడు. సాధార‌ణ గిటార్ మాదిరిగానే ఆ అస్థిపంజ‌రాన్ని మార్చి అందరిని విస్మయానికి గురి చేశాడు. ఎలక్ట్రానిక్ గిటార్ మాదిరిగానే దాన్ని రూప‌క‌ల్ప‌న చేసిన ప్రిన్స్ మిడ్‌నైట్ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచాడు. ఈ అస్థిపంజ‌రం గిటార్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు, దాని నుంచి వచ్చే మ్యూజిక్ అంద‌రినీ రంజింపజేస్తోంది. మొత్తంగా, ప్రిన్స్ ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు.