Tank Taxi : ఐడియా అదిరింది.. యుద్ధ ట్యాంక్‌నే టాక్సీలా మార్చేశాడు

బ్రిటీష్ టాక్సీ డ్రైవర్ మార్లిన్ బ్యాచిలర్ మార్కెట్‌ను ఏలేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని నార్విచ్ వీధుల్లో ట్యాంక్ టాక్సీని నడుపుతున్నాడు.

Tank Taxi : ఐడియా అదిరింది.. యుద్ధ ట్యాంక్‌నే టాక్సీలా మార్చేశాడు

Tank Taxi

Tank Taxi : ఈ రోజుల్లో టాక్సీల కొరత లేదు. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ట్యాక్సీలతో కొత్తవారు ఆ రంగంలో నిలదొక్కుకోలేక పోతున్నారు. గతంలోలా ఆదాయం కూడా రావడంలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త ఆలోచనతో కొత్త టాక్సీని ప్రారంభించబోతున్నారు ఓ వ్యక్తి. బ్రిటీష్ టాక్సీ డ్రైవర్ మార్లిన్ బ్యాచిలర్ మార్కెట్‌ను ఏలేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. మెర్లిన్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని నార్విచ్ వీధుల్లో ట్యాంక్ టాక్సీని నడుపుతున్నాడు. ఆది అలాంటి ఇలాంటి టాక్సీ కాదు.. యుద్ధట్యాంక్. గతంలో బ్రిటిష్ ఆర్మీ వాడిన ట్యాంక్‌ను దాదాపు రూ.20 లక్షలకు కొనుగోలు చేశాడు మార్లిన్.

చదవండి : Taxi Driver beaten by Girl:సిగ్నల్ వద్ద డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన యువతి.. ట్రాఫిక్ పోలీసును కూడా

1967 సైనిక వాహనాన్ని గతేడాది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అంతకు ముందు నాలుగు దశాబ్దాలుగా ఒకరి పెరట్లో నిరుపయోగంగా పడిఉందని మెర్లిన్ చెప్పాడు. ఇక మెర్లిన్ దీనిని టాక్సీగా నడపడానికి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం, వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రమే ప్రయాణీకులను తీసుకెళ్లడానికి లైసెన్స్ ఉంది. ఒక్కో ట్రిప్పుకు దాదాపు రూ.75,000 వసూలు చేస్తున్నాడు.

చదవండి : Flying Taxi: భవిష్యత్ రవాణా మొత్తం గాల్లోనే..

ఈ ట్యాంక్‌లో సౌకర్యవంతమైన సీటింగ్, టీవీ, స్టవ్‌తో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ ట్యాంక్‌లో ఒకేసారి తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. అదే సమయంలో, అయితే ఇది ట్యాంక్ కాదని, సాయుధ వ్యక్తిగత క్యారియర్ అని అతను చెప్పాడు. ఇది ట్యాక్సీ అంత స్మూత్‌గా ప్రయాణించక పోయినప్పటికీ, భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని ఆయన చెప్పారు. రోడ్డుపై ఈ వాహనం వెళ్తుంటే ప్రజలు శ్రద్ధగా చూస్తారు.. నవ్వుతారు ఈలలు వేస్తారని ఆయన అన్నారు. ప్రస్తుతం అతను హోండా సివిక్‌ను టాక్సీగా ఉపయోగిస్తున్నాడు.