వైద్యులకు షాక్: చెవిలో బొద్దింకల ఫ్యామిలీ

వైద్యులకు షాక్: చెవిలో బొద్దింకల ఫ్యామిలీ

చెవి పోటుతో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ న్యూస్ తెలిసింది. అతిని చెవిలో బొద్దింక.. కాదు బొద్దింకల కుటుంబం ఉందని తెలిసింది. లబోదిబోమని డాక్టర్లు బతిమాలుకుని చికిత్స చేయించుకుని బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. హూయాంగ్ అనే జిల్లాలో ఉన్న సానె హాస్పిటల్ కు ఎల్వీ అనే వ్యక్తి వచ్చాడు. 

చెవిలో నొప్పిగా ఉందని ఈఎన్టీ స్పెషలిస్టుని కలిశాడు. ‘అతనికి చెవిలో చాలా నొప్పిగా ఉందన్నాడు. ఏదో పాకుతూ ఉన్నట్లుగా ఉందని, దాని వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నానని వాపోయాడు. లైట్ వేసి చూసేసరికి బొద్దింకలు ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ కనిపించాయి. అవి అప్పటికే చెవి లోపలి భాగంలో చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి’ 

ఓ పెద్ద బొద్దింక లోపలికి దూరి పిల్లలు పెట్టింది. అతనికి చికిత్స చేసి పదికి పైగా బొద్దింకలను లోపలి నుంచి బయటకు తీశారు. తల్లి బొద్దింకను తీయడానికి కొంచెం ఇబ్బంది అయిందని ఇప్పుడు అతని కుడి చెవికి ఏ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అతని మంచానికి దగ్గర్లో సగం తిని వదిలేసిన ఆహారం ఉండడం కారణంగా పురుగులు, బొద్దింకలు లాంటి కీటకాలు మంచం మీద సంచరిస్తూ ఉండొచ్చని వారు వెల్లడించారు.