Horse Howle : గుర్రంలా సకిలించినందుకు మూడేళ్ళ జైలుశిక్ష

భార్య వదిలి వెళ్లిన నాటి నుంచి మానసికంగా కుమిలిపోయాడా వ్యక్తి. అవమానం, బాధ తట్టుకోలేక కుంగిపోయాడు. చివరకు మతిస్థితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్‌ సిస్టమ్, స్పీకర్స్‌ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు.

Horse Howle : గుర్రంలా సకిలించినందుకు మూడేళ్ళ జైలుశిక్ష

Horse Howle

Horse Howle : భార్య భర్తల గొడవ, వీధిలోని ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా రెండున్నరేళ్లు.. అవును నిజమే.. రెండున్నరేళ్లు నిద్రలేని రాత్రులు గడిపిన వీధి ప్రజలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రష్యాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతుండటంతో మూడేళ్ళ క్రితం విడిపోయారు.

భార్య వదిలి వెళ్లిన నాటి నుంచి మానసికంగా కుమిలిపోయాడా వ్యక్తి. అవమానం, బాధ తట్టుకోలేక కుంగిపోయాడు. చివరకు మతిస్థితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్‌ సిస్టమ్, స్పీకర్స్‌ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు.

ఆలా రెండున్నర ఏళ్లపాటు వీధి ప్రజలకు వేధించాడు. చివరికి అతడి బాధ తట్టుకోలేక మానసికవైద్యశాలలో చేర్పించాలని చూశారు.. కానీ లాభం లేకపోయింది. రోజు రోజుకు అతడి అతడి వేధింపులు అధికం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.