వణికిస్తున్న మరో వైరస్: దీని పుట్టుక కూడా చైనాలోనే!

  • Published By: vamsi ,Published On : March 25, 2020 / 02:06 AM IST
వణికిస్తున్న మరో వైరస్: దీని పుట్టుక కూడా చైనాలోనే!

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మరో వైరస్ పుట్టుకకు కూడా కారణం అయ్యింది. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆకుల్లా ప్రాణాలు రాలిపోతుంటే.. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మానవాళి ఉంది. దీంతో చైనాని తిట్టిపోస్తున్నారు ప్రతి ఒక్కరు.. అటువంటి తరుణంలోనే.. వైరస్‌లను పుట్టించి ప్రపంచం మీదకు వదులుతుంది అని ఆరోపణలు వస్తున్న సమయంలోనే ఇప్పుడు మరో వైరస్ తెరమీదకు వచ్చింది. అది కూడా చైనా నుంచే…

అవును హంటా వైరస్ అట.. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ వైరస్ కారణంగా ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, 32 మంది చికిత్స చేయించుకుంటున్నారు. అసలు హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల నుంచి సంక్రమిస్తుందట. ది సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.

1978లో దక్షిణ కొరియాలోని హంటాన్ నది సమీపంలో ఎలుకల వల్ల ఈ వైరస్ పుట్టడంతో దీనికి హంటాన్ వైరస్ అనే పేరు వచ్చింది. కొరియన్ యుద్దం తరువాత ఐక్యరాజ్యసమితి దళాలలో 3 వేల మందిలో కొరియన్ హెమరాజిక్ ఫీవర్ నమోదైంది. ఆ తర్వాత 1981లో హంటా వైరస్ అనే మరో జాతి తెరపైకి వచ్చింది. హెమరాలిజిక్ ఫీవర్ విత్ రెనాల్ సిండ్రోమ్‌ ఈ వైరస్ సోకితే కనిపించే లక్షణాలు. 

అయితే ఈ వైరస్‌లలో 21 జాతులు ఉన్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చెప్పుకొచ్చింది. ఈ జాతుల్లో కాటన్, వైట్-ఫుటెడ్, రైస్, డీర్ తదితర జాతుల ఎలుకలు ఉన్నాయి. అయితే హంటా వైరస్ వ్యాపించేది ఎలాగంటే.. ఎలుకల మలం, మూత్రం, చొంగ మనిషికి తాకినా, ఎలుక కొరికినా ఆ ఎలుకలోని వైరస్ మనిషిలోకి ప్రవేశిస్తుంది.

ఈ హంటా వైరస్ డెడ్లీ వైరస్.. కరోనా కంటే ప్రమాదం.. కరోనా మృతుల శాతం మహా అంటే 8శాతం.. కానీ ఈ హంటా వైరస్ మృతుల శాతం 38శాతం అట. ఈ వైరస్ సోకిన వారం నుంచి రెండు వారాల తరువాత వ్యాధి లక్షణాలు మనిషిలో కనిపిస్తాయి. ముందుగా అలసట, జ్వరం, కండరాల నొప్పులు(ముఖ్యంగా తొడలు, వీపు, భుజాల్లో) లక్షణాలు కనిపిస్తాయి. హంటా వైరస్ సోకిన వ్యక్తికి తలనొప్పి, మైకం, చలి, కడుపు నొప్పి ఎక్కువగా వస్తాయి. నాలుగు నుంచి పది రోజుల్లోపు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది.

See Also | మా వాళ్లు ఎట్లున్నారో : న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు