EMI కట్టనేలేదు: ఆపిల్ అనుకొని ‘ఐఫోన్’ విసిరాడు

జూ పార్క్ కు వెళ్తే ఏం చేస్తారు. సరదగా జూలోని జంతువులన్నింటిని చూస్తు మురిసిపోతారు. లేదా.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వెంట తెచ్చుకున్న పండ్లు ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా వేస్తారు. అంతేగా..

  • Published By: sreehari ,Published On : February 12, 2019 / 10:30 AM IST
EMI కట్టనేలేదు: ఆపిల్ అనుకొని ‘ఐఫోన్’ విసిరాడు

జూ పార్క్ కు వెళ్తే ఏం చేస్తారు. సరదగా జూలోని జంతువులన్నింటిని చూస్తు మురిసిపోతారు. లేదా.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వెంట తెచ్చుకున్న పండ్లు ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా వేస్తారు. అంతేగా..

జూ పార్క్ కు వెళ్తే ఏం చేస్తారు. సరదగా జూలోని జంతువులన్నింటిని చూస్తు మురిసిపోతారు. లేదా.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వెంట తెచ్చుకున్న పండ్లు ఏమైనా ఉంటే వాటికి ఆహారంగా వేస్తారు. అంతేగా.. ఇక్కడ జూకు వచ్చిన ఓ యువకుడు మాత్రం ఏకంగా ఖరీదైన ఐఫోన్ ఆహారంగా వేశాడు. వేలకు వేలు పోసి అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎంతో ముచ్చటపడి కొనుకున్నాడు. అనుకోకుండా తన ఐఫోన్ ను ఎలుగుబంట్లకు ఆహారంగా విసిరి లబోదిబోమంటున్నాడు. ఐఫోన్ నేరుగా వెళ్లి ఎలుగుబంట్ల దగ్గర పడింది.

అది చూసిన ఎలుగుబంట్లు ఇదేదో ఆహారమని తినేందుకు తెగ ట్రై చేశాయి. ఎలుగుబంట్లలో ఒకటి ఐఫోన్ ను నోటితో పట్టుకొని లోపలికి పరిగెత్తింది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్ లోని యాన్ చెంగ్ వైల్డ్ లైఫ్ జూ పార్క్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలుగుబంట్లకు ఆహారంగా వేయాలంటే ఏ పండ్లు, కూరగాయాలో వేయాలి.. ఇదేంటీ ఐఫోన్ ఆహారంగా వేయడమేంటిని అందరూ అనుకున్నారంతా.. అదే విషయాన్ని ఐఫోన్ విసిరిన వ్యక్తిని అడిగితే ఏమన్నాడో తెలుసా..
 

ఎలుగుబంట్లకు నా ఐ ఫోన్ ఆహారంగా వేయలేదు. జూ పార్క్ లో జంతువులను చూద్దామని ఇక్కడికి వచ్చా. అందరూ ఎలుగుబంట్లకు ఆహారం వేస్తుంటే.. అది చూసి నేను కూడా ఆపిల్ పండ్లు, క్యారెట్లు ఆహారంగా వేశాను. ఒక్కొక్కటి చేతిలోకి తీసుకొని ఎలుగుబంట్ల వైపు విసిరాను. అదే సమయంలో నా చేతిలో ఐఫోన్ కూడా ఉంది. పొరపాటున ఆపిల్ పండు అనుకొని ఐఫోన్ విసిరాను. ఎంతో ముచ్చటపడి యాభైవేలు పోసి ఐఫోన్ కొనుకున్నా. ఐఫోన్ ఫస్ట్ EMI కూడా ఇంకా కట్టలేదని బావురమన్నాడు.

ఎలాగైనా తన ఐఫోన్ ను ఎలుగుబంట్ల దగ్గర నుంచి తీసి ఇప్పించడంటూ జూ అధికారులను కోరాడు. చివరికి జూ అధికారులు అతడి ఐ ఫోన్ ను ఎత్తుకెళ్లిన ఎలుగుబంటి నుంచి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటికే ఆ ఐఫోన్ పగిలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు 11వేల వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఎలుగుబంట్లకు ఖరీదైన ఆహారమంటూ జోకులు పేలుస్తున్నారు. 
 

ఇటీవల ఇలాంటి ఘటనే చైనాలోని జూ పార్క్ లో జరిగింది. 8ఏళ్ల పాప ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ ఎలుగుబంట్లు ఉండే ప్రదేశంలో జారిపడింది. అది చూసిన జూ పార్క్ అధికారులు అప్రమత్తమై బాలికను రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం