ట్రంప్ ట్విట్టర్ హ్యాక్ నిజమే…ఆ “పాస్‌వర్డ్” ఎవరైనా ఊహించగలరు

ట్రంప్ ట్విట్టర్ హ్యాక్ నిజమే…ఆ “పాస్‌వర్డ్” ఎవరైనా ఊహించగలరు

Man hacked Trump’s Twitter account అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైన విషయం నిజమేనట. అక్టోబర్-22న అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశ సమయంలో ట్రంప్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందన్న వార్తలు వచ్చాయి. ట్రంప్ ట్విట్టర్ లోని కొన్ని స్క్రీన్ షాట్లు దీనిని తెలియజేస్తున్నాయంటూ పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నగా..వైట్ హౌస్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైందన్న వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ కూడా ఇదే చెప్పింది. ట్రంప్ అకౌంట్ హ్యాక్ అయిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ట్విట్టర్ పేర్కొంది

అయితే,ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నిజంగానే హ్యాకింగ్ కి గురైనట్లు తేలింది. విక్టర్ గీవర్స్ అనే హ్యాకర్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసినట్లు డచ్ ప్రాసిక్యూటర్స్ గుర్తించారు. ట్రంప్ పాస్ వర్డ్ కనిపెట్టి అతని ట్విట్టర్ అకౌంట్ లోకి విజయవంతంగా గీవర్స్ చొరబడినట్లు గుర్తించారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపిన ప్రకారం.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్ వర్డ్ “MAGA2020”. ఈ పాస్ వర్డ్ Make America Great Again అనే ట్రంప్ నినాదాన్ని ప్రతిబింబిస్తుంది.

అయితే, నైతికంగా వ్యవహరించాడన్న కారణంతో గీవర్స్ కి ఎటువంటి శిక్ష విధించలేదు. ఏదైనా లోపాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టేందుకు అమెరికా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ని చెక్ చేసినట్లు గీవర్స్ తెలిపారు. ఫలితం చూసి తాను చాలా సంతోషం చెందానన్నారు. ఇది కేవలం తన పని గురించి కాదని..ఇంటర్నెట్ లో ఇది నా పని గురించి మాత్రమే కాదు,కానీ ఇంటర్నెట్‌లో హాని కోసం చూస్తున్న వాలంటీర్ల అందరి విషమయని ఆయన అన్నారు.

హ్యాకర్ గీవర్స్ లాగిన్ ను తనకుతానుగా రిలీజ్ చేశాడని డచ్ పోలీసులు తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ఈ ట్విట్టర్ ఖాతాను స్వాధీనం చేసుకోగలిగితే ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పాస్వర్డ్ యొక్క బలాన్ని గీవర్స్ పరిశోధించారని పోలీసులు తెలిపారు. యూఎస్ అధికారులకు తమ ఫైండింగ్స్ ని పంపించామని తెలిపారు.

అక్టోబర్ లో ఈ హ్యాకింగ్ వార్త వచ్చినప్పుడు ఓ డచ్ వార్తాపత్రికతో మాట్లాడిన గీవర్స్… నాలుగు విఫల ప్రయత్నాల తర్వాత తన ఐదవ అంచనాతో ట్రంప్ ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలిగినట్లు చెప్పాడు. రెండు దశల ధృవీకరణను ప్రారంభించమని తాను ట్రంప్ కి మెయిల్ చేశానని గీవర్స్ తెలిపాడు.! IWillMakeAmericaGreatAgain2020! వంటి బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించమని ట్రంప్ కి సూచించానని గీవర్స్ అన్నారు.

అయితే,ఆశ్చర్యకరంగా…కేవలం పాస్ వర్డ్ ద్వారా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ని గీవర్స్ హ్యాక్ చేయడం సాధ్యం కానిపని అని ట్విట్టర్ తెలిపింది. గీవర్స్ చెప్పిన విషయాన్ని ట్విట్టర్ కొట్టివేసింది. మరోవైపు, 2016లో కూడా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లోకి తాను,మరో ఇద్దరు సెక్యూరిటీ రిసెర్చర్లు లాగిన్ అయ్యాయని ఈ ఏడాది ప్రారంభంలో గీవర్స్ చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడు ట్రంప్ పాస్ వర్డ్ “yourefired” అని గీవర్స్ పేర్కొన్నారు.