పూల కుండీ కింద బీర్లు..లిప్టులా పైకి లేచిన బాటిళ్లు..!! నీ ఐడియా‘సల్ల’గుండా..!

పూల కుండీ కింద బీర్లు..లిప్టులా పైకి లేచిన బాటిళ్లు..!! నీ ఐడియా‘సల్ల’గుండా..!

Under Ground Beer Cooler (1)

beer compartment under plant pot : సాధారణంగా పూల కుండీల కింద ఏం ఉంటాయి? అదేం పిచ్చి ప్రశ్న పూల కుండీలను గోడలమీద పెడతారు?నేలమీద పెడతారు. కానీ బీరు బాటిళ్లమీద పూల కుండీలను పెట్టే ఐడియా గురించి విన్నారా?అంటే లేదనే చెబుతాం. కానీ..పూల కుండీల కింద ఏకంగా బీరు బాటిళ్ల కంటైనర్ నే సెట్ చేశాడో యువకుడు. సాధారణంగా బీరుబాటిళ్లను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు. కానీ పూల కుండీల కింద ఏ స్పెషల్ సెటప్ తో బీరుబాటిల్స్ ను వినూత్నంగా ఏర్పాటు చేశాడో యువకుడు.

30

బీర్లను ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా చూస్తారు. ‘ఏరా ఓ బీరు ఏద్దామా?అని అడుగుతారు.లేదా ఇంట్లో అన్ని బీర్లు పెట్టుకుని పార్టీ చేసుకుందామనే మాటే అనవేంటీరా? నీ కక్కుర్తి తలగలెయ్యా’ అంటారు. కానీ బీరు బాటిల్స్ పూల కుండీల కింద ఉంటే ఎవ్వరూ చూడరు. అస్సలు అది ఎవ్వరూ ఊహించరు కూడా. ఓ అబ్బాయికి వచ్చిన కత్తిలాంటి ఆలోచనతో బీరు బాటిల్స్ కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బుర్రకు పదును పెట్టి ఎవ్వరూ ఊహించని విధంగా బీరు బాటిల్స్ ను దాచిపెట్టాడు.

31

బీర్లు దాచేందుకు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పూల కుండీల అడుగున కనీసం పాతిక బీర్లు పట్టేలా కంపార్ట్‌మెంట్ రూపొందించాడు. బయటకు చూసేందుకు అది పూల కుండీలాగే కనిపిస్తుంది. కానీ, చిన్న బటన్ నొక్కితే.. పూల కుండీ పైకి లేస్తుంది. దాని అడుగున ఉన్న మందు బాటిళ్ల కంపార్ట్‌మెంట్ లిప్టు మాదిరిగా పైకి ఝమ్మంటూ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ టెక్నాలజీ వీడియోను మీరూ చూసేయండి…చూశాక మీరే అంటారు? నీ ఐడియా బీర్లు ఎత్తుకెళ్లా అని..పైకి లేచి బీరు బాటిల్ ను తీసుకుని చక్కగా తాగేయొచ్చు..

Beer

 

https://youtu.be/mN0qmNFJikM