Italy: ఆరేళ్లుగా తల్లి శవంతోనే నివసిస్తున్న ఒక వ్యక్తి.. ఎందుకో తెలుసా?

మమ్ హెల్గా మారియా హెంగ్‌బార్త్ అనే మహిళ ఆరు సంవత్సరాల క్రితం (86 సంవత్సరాల వయస్సులో) మరణించించినట్లు గుర్తించారు. గత ఆరేళ్లుగా హెల్గాకు సంబంధించిన ఏ వివరాలు సరిగా లేవు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆమె తన ఆరోగ్య బీమా కార్డుపై ఎటువంటి క్లెయిమ్ చేయనట్లు కనుగొన్నారు.

Italy: ఆరేళ్లుగా తల్లి శవంతోనే నివసిస్తున్న ఒక వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Helga Maria: ఒక వ్యక్తి తల్లికి వచ్చే పెన్షన్ కోసం ఆమె చనిపోయినప్పటికీ ఆరు నెలల పాటు ఆ విషయాన్ని బయటపెట్టకుండా, శవాన్ని ఇంట్లోనే ఒక సంచిలో దాచి ఉంచాడు. ఇరుగుపొరుగు వారికి తన స్వస్థలమైన జర్మనీకి వెళ్లినట్లు కుమారుడు చెప్పాడు. అయితే అధికారుల తనిఖీలో అసలు విషయం బయటపడింది.ఇంట్లోని ఒక గదిలో సంచిలో మమ్మీ రూపంలో ఉన్న ఆమె అవశేషాలను పోలీసులు కనుగొననారు. ఇటలీలో వెలుగు చూసిన ఈ దారుణంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Nigeria: విపక్షాల తీవ్ర నిరసనల మధ్యే నైజీరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బొలా తినుబు

మమ్ హెల్గా మారియా హెంగ్‌బార్త్ అనే మహిళ ఆరు సంవత్సరాల క్రితం (86 సంవత్సరాల వయస్సులో) మరణించించినట్లు గుర్తించారు. గత ఆరేళ్లుగా హెల్గాకు సంబంధించిన ఏ వివరాలు సరిగా లేవు. కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆమె తన ఆరోగ్య బీమా కార్డుపై ఎటువంటి క్లెయిమ్ చేయనట్లు కనుగొన్నారు. మే 25న ఉత్తర ఇటలీలోని వెనెటో ప్రాంతంలోని వెరోనాలోని అపార్ట్‌మెంట్‌లోకి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చొరబడే వరకు ఈ గుట్టు బయటికి రాలేదు.

Naatu Naatu : ‘నాటు నాటు’తో యుక్రెయిన్ నిరసన.. సైనికుల రీ క్రియేట్ వీడియో వైరల్!

ఫ్లాట్ లోపల హెల్గా దారుణంగా కుళ్ళిపోయి, బెడ్‌పై మమ్మీ చేయబడిన ఆమె శవాన్ని బాడీ బ్యాగ్‌లోకి జిప్ చేసి ఉంది. అయితే చాలా కాలంగా తాను ఇంట్లో లేనని, తన తల్లితో ఎవరూ లేరని బుకాయించే ప్రయత్నం కుమారుడు చేశాడు. అయితే ఆరేళ్లుగా ఆమె పెన్షన్ క్లెయిమ్ అవుతుండడంతో కుమారుడే ఇదంతా చేశాడని తెలిసింది. హెల్గా ఎలా చనిపోయిందో నిర్ధారించడానికి ప్రాసిక్యూటర్లు శవపరీక్షకు ఆదేశించారు. హెల్గా చనిపోయిన ఆరేళ్లలో ఆమె పెన్షన్ చెల్లింపులను కొడుకు ఎలా క్లెయిమ్ చేయగలిగాడు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Japan: స్వలింగ వివాహాల్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.. జపాన్ కోర్టు తీర్పు

అతను ఆరు సంవత్సరాల పాటు సంవత్సరానికి 30,000 యూరోలు (ఇండియన్ కరెన్సీలో 26,60,880 రూపాయలు) చొప్పున మొత్తం మొత్తం 180,000 యూరోలు (1,59,61,430 రూపాయలు) సేకరించినట్లు స్థానిక మీడియా నివేదించింది. దీనిపై విచారణ కొనసాగుతోందని అక్కడి పోలీసులు తెలిపారు.