ఆ ప్రైవేట్ పార్టులో మాస్కు పెట్టుకుని రోడ్డుపై నగ్నంగా తిరిగిన వ్యక్తి

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 10:34 AM IST
ఆ ప్రైవేట్ పార్టులో మాస్కు పెట్టుకుని రోడ్డుపై నగ్నంగా తిరిగిన వ్యక్తి

సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగింది. నగ్నంగా, ఆ పార్టులో మాస్కు పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిని చూసి అంతా షాక్ అయ్యారు. వీడెవండి బాబూ అని విస్తుపోయారు. రోడ్డుపై వెళ్తున్న వారు అతడిని అలానే చూస్తుండిపోయారు. మహిళలు సిగ్గుతో తలదించుకున్నారు. కొందరు నవ్వుకున్నారు.

ఆ వ్యక్తి ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ లో నడుచకుంటూ వెళ్లాడు. లైట్ బ్లూ కలర్ మాస్కుతో తన ప్రైవేట్ భాగాన్ని కవర్ చేశాడు. కొందరు ఆ వ్యక్తిని చూసి షాక్ లో ఉండిపోతే కొందరు తన ఫోన్లకు పని చెప్పారు. వెంటనే అతడి ఫొటోలు, వీడియాలో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎవరి గురించి పట్టించుకోని ఆ వ్యక్తి తన దారిన తాను వెళ్లిపోయాడు.

ఆ వ్యక్తి తీరుతో అంతా అవాక్కయ్యారు. అతడు ఎవరు? ఎందుకిలా చేశాడు? ఏం చెప్పాలని అనుకున్నాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కరోనా కట్టడి కోసం లండన్ లో కొత్త రూల్ తీసుకొచ్చారు. షాప్స్ లోకి వెళ్లే కస్టమర్లు కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని నిబంధన పెట్టారు. ఈ రూల్ తెచ్చిన నెక్ట్స్ డేనే ఆ వ్యక్తి ఇలా నగ్నంగా బయటకు రావడం, ప్రైవేట్ భాగం దగ్గర మాస్కు పెట్టుకోవడం చర్చకు దారితీసింది.