ప్రేయసి ఉంగారాన్ని దొంగిలించి..మరొకరికి..చివరిలో

ప్రేయసి ఉంగారాన్ని దొంగిలించి..మరొకరికి..చివరిలో

ring stolen from other lover : తనకు నచ్చిన వ్యక్తికి ఎదైనా గిఫ్ట్ తో ఇంప్రెజ్ చేయాలని అనుకుంటారు. గిఫ్ట్ లు, సర్ ఫ్రైజ్ లు ఇస్తూ..ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ..ఓ వ్యక్తి మాత్రం ఎంగేజ్ మెంట్ సమయంలో ప్రేయసికి ఇచ్చిన ఉంగారాన్ని దొంగిలించి..మరో లవర్ కు ఇచ్చాడు. అంతేగాదు..ఆమెను ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆ యువతి..పోలీసులను ఆశ్రయించడంతో అతని భాగోతం బట్టబయలైంది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

జోసెఫ్ డేవిస్..ఆరెంజ్ సిటీకి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని యువతికి తెలియచేశాడు. ఆమె కూడా ఎస్ అని చెప్పడంతో..ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయి. ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఒక్కసారిగా ప్రియుడు డేవిస్ టచ్ లో ఉండకుండా పోయాడు. ఓ రోజు..అతడి ఫేస్ బుక్ ను గమనించసాగింది. ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఓ యువతితో కలిసి ఉన్న ఫొటోను చూశాడు. ఆ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనబడడంతో షాక్ కు గురైంది. తీరా పరిశీలించి చూడగా..ఆ ఉంగరం తనదేనని గుర్తు పట్టింది. ఎందుకైనా మంచిదని..బీరువా అంతా వెతకగా..ఖాళీ ఉంగరం బ్యాక్స్ కనిపించడం, మరికొన్ని ఆభరణాలు కనిపించలేదు. వీటన్నిటి విలువ 6 వేల 270 డాలర్లు.

దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి..అతడిని పట్టుకుని నిలదీసింది. తీసుకున్న ఆభరణాల్లో కొన్నింటిని తిరిగి ఇచ్చేశాడు. అతడు కరెక్టు కాదని..కటీఫ్ చెప్పింది. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. డేవిస్‌.. జో బబ్రౌన్‌, మార్కస్‌ బబ్రౌన్‌ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను మోసం చేశాడని తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.