Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా

ఏడాదికి మూడున్నర కోట్ల జీతం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఉద్యోగాన్ని కోరుకునే వాళ్లు ఎందరో. ఒక్కసారి అలాంటి జాబ్ వస్తే ఎవరైనా పూర్తి టైమ్ పనిచేయాలనుకుంటారు. కానీ, అలాంటి ఉద్యోగాన్ని వదులుకున్నాడో వ్యక్తి.

Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా

Man Quits Job

Man Quits Job: ఏడాదికి మూడున్నర కోట్ల జీతం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఉద్యోగాన్ని కోరుకునే వాళ్లు ఎందరో. ఒక్కసారి అలాంటి జాబ్ వస్తే ఎవరైనా పూర్తి టైమ్ పనిచేయాలనుకుంటారు. కానీ, అలాంటి ఉద్యోగాన్ని వదులుకున్నాడో వ్యక్తి. అది కూడా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని, బోర్ కొడుతోందని వదిలేశాడు. అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే ఇంజనీర్ అమెజాన్ సంస్థను వదిలి, 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో చేరాడు. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కంపెనీలో మంచి హోదా.

Ghmc Corporators: జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాని పిలుపు

ఏడాదికి మూడున్నర కోట్ల జీతం. ఫ్రీ ఫుడ్, ఇతర అలవెన్సులు. దానితోపాటు అన్‌లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్. అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ, అలాంటి ఉద్యోగాన్ని ఈజీగా వదులుకున్నాడు లిన్. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదని, బోరింగ్‌గా అనిపించిందని, అందుకే జాబ్ మానేశానని చెప్పాడు. ‘‘నెట్‌ఫ్లిక్స్‌లో ఇంజనీర్‌గా చేరిన కొత్తలో పని చేయడానికి ఉత్సాహంగా ఉండేది. కానీ, కోవిడ్ వల్ల పరిస్థితులు మారిపోయాయి. అంతకుముందులాగా అందరితో కలిసి పనిచేయడం, సహోద్యోగులతో గడపడం, ప్రోత్సాహకాలు వంటివి ఆగిపోయాయి. మారనిదల్లా పని మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో పనిని ఎంజాయ్ చేయలేకపోయా. దీంతో ప్రొడక్ట మేనేజ్‌మెంట్‌లోకి మారుదామనుకున్నా. ఇందుకోసం కంపెనీలో చాలా ప్రయత్నించా. కానీ, సాధ్యం కాలేదు. ఒక రోల్ నుంచి మరో రోల్‌కు ఉద్యోగుల్ని పంపించడానికి నెట్‌ఫ్లిక్స్‌ అంగీకరించదు. దీంతో చాలాసార్లు ప్రయత్నించి విసిగిపోయా. చేస్తున్న పనిలో మోటివేషన్ లేకుండా పోయింది. బోరింగ్‌గా అనిపించింది. డబ్బులు అయితే వస్తున్నాయి. కానీ కెరీర్‌లో ఎలాంటి ఎదుగుదల, సంతోషం లేవు. అందుకే జాబ్ మానేయాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయాన్ని ముందుగా పేరెంట్స్ వ్యతిరేకించారు. తర్వాత మా మెంటార్ కూడా.

Girl Sexually Assaulted: హైదరాబాద్‌లో దారుణం.. మరో మైనర్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి

‘ఇప్పుడే జాబ్ వదిలేస్తే.. భవిష్యత్తులో అవసరమైనప్పుడు వేరే కంపెనీలో చేరాలనుకుంటే శాలరీ డిమాండ్ చేసే అవకాశాన్ని పోగొట్టుకుంటావు’ అని కూడా హెచ్చరించాడు. సామాజికంగా, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడతానని అందరూ చెప్పారు. అయినా సరే ఇష్టంలేని జాబ్‌లో పనిచేయలేక రాజీనామా చేశాను’’ అని లిన్ వివరించాడు. ఆయన గత ఏడాది మేలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జాబ్‌ వదిలేసిన ఇన్ని నెలలు తాను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.