Man Saves Dog:పెళ్లి పక్కకుపెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా కుక్కను కాపాడిన పెళ్లికొడుకు

ఈ రోజుల్లో జంతు ప్రేమికులు బాగా పెరిగిపోతున్నారండీ.. అందుకే సోషల్ మీడియాలో వాటిని కాపాడిన వీడియోలకు అంత క్రేజ్. రీసెంట్ గా ఇదే కేటగిరీకి చెందిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పెళ్లి ముహూర్తాన్ని పక్కకు పెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా ఓ కుక్కను కాపాడాడు పెళ్లికొడుకు. నిజంగా ఇది మంచి విషయమే.

Man Saves Dog:పెళ్లి పక్కకుపెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా కుక్కను కాపాడిన పెళ్లికొడుకు

Man Saves Dog

Man Saves Dog: ఈ రోజుల్లో జంతు ప్రేమికులు బాగా పెరిగిపోతున్నారండీ.. అందుకే సోషల్ మీడియాలో వాటిని కాపాడిన వీడియోలకు అంత క్రేజ్. రీసెంట్ గా ఇదే కేటగిరీకి చెందిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పెళ్లి ముహూర్తాన్ని పక్కకు పెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా ఓ కుక్కను కాపాడాడు పెళ్లికొడుకు. నిజంగా ఇది మంచి విషయమే.

ఏ పబ్లిసిటీ కోసమే అందరినీ పిలిచి నానా రచ్చ చేయకుండా చూసిన వెంటనే తానే ఓ ప్లాట్ ఫాం పట్టుకుని వేలాడుతున్న కుక్కను పట్టుకుని పైకా లాగాడు. అంచును పట్టుకుని ఉన్న కుక్క భయంతో వణికిపోతూ పైకి చూస్తూ ఉంది. దానిని చూసిన పెళ్లికొడుకు తన వెడ్డింగ్ డ్రెస్ అయిన సూట్ తీసి పక్కకుపెట్టి.. ప్లాట్ ఫాం మీదముందుకు పడుకున్నట్లుగా ఉండి కుక్కను పైకి లాగే ప్రయత్నం చేశాడు.

చాలా సేపు కుక్కని పైకి తీసుకొచ్చేందుకు అందకపోవడంతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకొంచెం కిందకు జారితే అతను పడిపోతాడని భయపడ్డాడో ఏమో.. అక్కడి నుంచే ప్రయత్నిస్తూ ఉండగా మరో వ్యక్తి వచ్చి తనకు సపోర్ట్ ఇచ్చాడు. అలా ముందుకు వంగి కుక్క ఒక కాలిని అందుకున్నాడు.

Read Also: ప్రపంచంలోనే ఎతైన కుక్కగా గిన్నిస్ రికార్డు

అలా కుక్కను పైకి లేపగా తనతో పాటు ఉన్న మరో వ్యక్తి కుక్కను అందుకుని ఒడ్డున పడేశాడు. ఇదంతా దూరం నుంచి వీడియో తీసిన వ్యక్తి.. అత్యద్భుతం అంటూ అరుస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచాడు. చివరకు కుక్కను కాపాడిన ఆ పెళ్లికొడుకు దాంతో పాటే వెడ్డింగ్ హాల్ కు వెళ్లాడు.