Real love story : ప్రియురాలి కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్ తొక్కాడు

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఇండియాకు చెందిన మహానందియా.. యూరప్‌కు చెందిన షార్లెట్ వాన్ షెడ్విన్‌లు. విమానం ఎక్కడానికి డబ్బులు లేక సైకిల్‌పై యూరప్‌కు చేరుకున్న మహానందియా తన ప్రేమను చాటుకున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథ చదవండి.

Real love story : ప్రియురాలి కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్ తొక్కాడు

Real love story

Mahanandi-charlotte von schedvin love story : అతను ఇండియా.. ఆమె స్వీడన్.. ఇండియా చూడటానికి వచ్చిన ఆమెతో ప్రేమలో పడ్డాడు. స్వదేశానికి వెళ్లిపోయిన ఆమెను తిరిగి కలవాలంటే విమాన టిక్కెట్‌కు అతని దగ్గర సరిపడా డబ్బులు లేవు. తన ప్రియురాలి కోసం అతను ఏం చేశాడంటే?

German Woman: రెండు దేశాలను కలిపిన ప్రేమ కథ

1975 నాటి ఓ అందమైన లవ్ స్టోరి ఇది. ఇండియాకు చెందిన మహానందియా స్కెచ్ ఆర్టిస్ట్.  ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ జిల్లాలో ఉండేవారు. షార్లెట్ వాన్ షెడ్విన్ టూరిస్టుగా ఇండియా చూడటానికి వచ్చారు. ఆ సమయంలో తన చిత్రాన్ని గీయమని మహానందియాను కోరిందట. అలా వీరి మధ్య జరిగిన పరిచయం కాస్త టీకి ఆహ్వానించడం వరకూ వెళ్లింది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయానికి వెళ్లారు. కొన్నిరోజులు మహానందియా ఉండే గ్రామానికి కూడా వెళ్లి  అతని తల్లిదండ్రుల ఆశీస్సులతో గిరిజన సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీకి వచ్చారు. తరువాత ఆమె తిరిగి వెళ్లవలసిన రోజు వచ్చింది. అయితే షార్లెట్‌ను కలవడానికి స్వీడన్ వస్తానని మహానందియా ఆమెకు ప్రామిస్ చేశారు.

 

కొంతకాలం ఇద్దరు ఉత్తరాలతో టచ్‌లో ఉన్నారు. ఇక మహానందియా షార్లెట్‌ను ఎలాగైనా కలవాలని అనుకున్నారు. విమానం టిక్కెట్టు కొనడానికి డబ్బులు లేవు. ఇక తన దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్మి సైకిల్ కొని యూరప్‌కి ప్రయాణం మొదలుపెట్టారు. 1977 జనవరి 2 న అతని ప్రయాణం ప్రారంభమైంది. రోజుకి 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. వెళ్లే దారిలో కొందరికి చిత్రాలు గీస్తూ వెళ్లేవారట. కొందరు ఆహారం, కొందరు ఆశ్రయం, కొందరు డబ్బు ఇచ్చేవారట. ఆ దేశానికి వెళ్లడానికి వీసా ఉండాలి కదా అని డౌట్ రావచ్చు. అప్పట్లో కొన్ని దేశాలకు వెళ్లడానికి వీసా అవసరం పడలేదట. మొత్తానికి అలా సైకిల్ మీద ప్రయాణం చేసి చేసి 1977 మే 23న ఇస్తాంబుల్, వియన్నా మీదుగా సైకిల్ పైన ఆ తరువాత  కొంతదూరం గోథెన్‌ బర్గ్‌కు రైలులోను ప్రయాణం చేసి షార్లెట్‌ని కలుసుకున్నారు మహానందియా. ఈ జర్నీలో అతను చాలా అలసిపోయాడట. కాళ్లు విపరీతమైన నొప్పులు వచ్చాయట.

King Charles III..Camilla : కింగ్ ఛార్లెస్‌-3, కెమిల్లా 35 ఏళ్ల ప్రేమగాథ .. రాజకిరీటంపై హక్కు కోసం వీరేం చేశారంటే..

ఇక షార్లెట్‌ తల్లిదండ్రులను అతి కష్టం మీద పెళ్లికి ఒప్పించి స్వీడన్‌లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు మహానందియా, షార్లెట్‌లు. ఇప్పటికీ  స్కెచ్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్న 62 ఏళ్ల మహానందియా తన భార్య, ఇద్దరు పిల్లలతో స్వీడన్‌లో ప్రస్తుతం ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. అయ్యబాబోయ్ ప్రియురాలి కోసం ఐరోపాకు సైకిల్ తొక్కడమా? అని జనం అడగటం మహానందియాకు ఆశ్చర్యం అనిపించిందట. ప్రేమలో మునిగిన మహానందియాకు అది పెద్ద కష్టం కాకపోవచ్చు.  ఏది ఏమైనా ఇండియా నుంచి తన ప్రియురాలి కోసం యూరప్ వరకూ సైకిల్ తొక్కిన మహానందియా ప్రేమ నిజంగా చాలా గొప్పది అని చెప్పాలి.