Bear : ఓ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి.. చివరికి

ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.

Bear : ఓ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టిన ఎలుగుబంటి.. చివరికి

Violent bear

Bear : అలా ఓ దారిన వెళ్తున్నారు.. సడెన్ గా ఓ ఎలుగుబండి (bear) వెంబడించింది అనుకోండి..ఆ సంఘటన ఊహకే భయం వేస్తుంది. అలా ఓ వ్యక్తిని వెంబడించింది ఎలుగుబంటి. దాని నుంచి తప్పించుకోవడానికి ఓ చెట్టెక్కాడు. అయినా వదల్లేదు. చివరికి ఏమైంది?

Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

కొంతమంది ప్రకృతి ప్రేమికులు (nature lovers) అడవులు, గుట్టల వైపు విహారానికి వెళ్తూ ఉంటారు. అలాగే వెళ్లాడు పాపం ఓ వ్యక్తి. ఆరోజు అతనికి కలిసిరానట్లుంది. ఓ ఎలుగుబంటి వెంబడించింది. ప్రాణభీతితో పరుగులు పెట్టిన అతను ఓ చెట్టెక్కాడు. ఇక ఆ ఎలుగుబంటి అక్కడ కూడా అతడిని వదిలిపెట్టలేదు. అదికూడా చెట్టు ఎక్కడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అతని కాళ్లు పట్టుకుని లాగడానికి ట్రై చేసింది. ఇక దాని నుంచి తప్పించుకోవడానికి అతను పడ్డ పాట్లు మాటల్లో చెప్పలేం. ఏమనుకుందో ఏమో ఆ ఎలుగుబంటి ఫైనల్ గా అతడిని వదిలిపెట్టేసింది. ఆ వ్యక్తి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. @OTerrifying అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు.

Mukul Kundra : రోడ్ సైడ్ పుస్తకాలు అమ్ముతూ..ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ దాకా సాగిన ఓ రచయిత అందమైన జర్నీ వీడియో వైరల్

ఇక ఈ వీడియో తీసిన వ్యక్తి అతనిని కాపాడే ప్రయత్నం చేయలేదని కొందరు.. ఆ ఎలుగుబంటి ఆటలు ఆడుతున్నట్లు ఉందని కొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ వీడియోని సోషల్ మీడియాలో వ్యూస్ తో దూసుకుపోతోంది.