బొమ్మతో ఏడాది కాలంగా శృంగారం, పెళ్లి కూడా చేసుకున్న బాడీబిల్డర్

బొమ్మతో ఏడాది కాలంగా శృంగారం, పెళ్లి కూడా చేసుకున్న బాడీబిల్డర్

Man Married Sex Doll: ఎవడి పిచ్చి వాడికి ఆనందం. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. అంటే ఇదేనేమో. ఓ బాడీబిల్డర్ చేసిన పని చూస్తే ఇలానే అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఓ సెక్స్ డాల్(బొమ్మ) తో ఏడాది కాలం పాటు సెక్స్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పెళ్లి కూడా చేసుకుని మురిసిపోతున్నాడు. అతడి పేరు యూరి టోలోచ్కో. కజక్ లో ఉంటాడు. వయసు 36ఏళ్లు. అతడు బాడీ బిల్డర్. ప్రస్తుతం ఇతడు మీడియాలో హెడ్ లైన్ గా మారాడు.

ఈ బాడీబిల్డర్ ఓ సెక్స్ డాల్ తో ఏడాదిగా సెక్స్ చేశాడు. ఇప్పుడు ఆ డాల్ ని పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రాణమున్న మనిషితో డేట్ చేయడం కన్నా బొమ్మతో డేట్ చేయడం చాలా సులువు అంటాడీ బాడీబిల్డర్. అతడి సెక్స్ డాల్ పేరు మార్గో. గతేడాది(2020) నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ స్పందన ఏంటి?
మార్గోతో తన జీవితం చాలా సుఖంగా సాగిపోతోందని బాడీబిల్డర్ చెబుతున్నాడు. పెళ్లి చేసుకున్న ఆనందంలో మునిగితేలుతున్నాడు. గాల్లో తేలినట్టు ఉందే అని ఫీల్ అవుతున్నాడీ బాడీబిల్డర్. కాగా, కుటుంబసభ్యులు, స్నేహితులు ఏమన్నారు అడిగితే.. వారి నుంచి సాధారణ స్పందన వచ్చిందని, మద్దతు కూడా లభించిందని తెలిపాడు. వారంతా నా ఆనందం కోరుకునే వారు అందుకే నాకు మద్దతు తెలిపారని వివరించాడు. తన సెక్స్ డాల్ మార్గోని వీధుల్లోకి తీసుకుని వెళ్లినప్పుడు ఎవరూ విమర్శించరని చెప్పాడు. అయితే ఇంటర్నెట్ లో మాత్రం విమర్శలు ఎదుర్కొన్నట్టు తెలిపాడు.

మార్గోతో రొమాంటిక్ డేట్స్ కి వెళతారా?
”మార్గో, నేను డేట్ కి వెళ్తాం. లాంగ్ వాక్ కి వెళ్తాం. కొత్త కొత్త ప్రదేశాలకు, రెస్టారెంట్లకు కూడా వెళ్తాం. అంతేకాదు డ్యాన్సింగ్ క్లబ్స్ కి వెళ్లి డ్యాన్సులు కూడా చేస్తాం. మేమిద్దరం కలిసి ప్రయాణం కూడా చేస్తాం. ఓసారి థాయ్ లాండ్ వెళ్లాం. ఆ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేశాం. అక్కడ అందరూ బాగా సహకరించారు. ఓసారి టైగర్ సఫారీ కూడా వెళ్లాము” అని బాడీబిల్డర్ ఎంతో ఆనందంగా చెప్పాడు.

 

మార్గో కేవలం బొమ్మ మాత్రమే కాదు. రోబోలాంటిది. అందులో ప్రొగ్రామ్ ఉంటుంది. కొన్ని సింపుల్ పదాలు పలకగలదు. అంతేకాదు ఈ సెక్స్ డాల్ కి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. బాత్ టబ్ లో ఉన్న ఫొటో, ఫేస్ మాస్క్ వేసుకున్న ఫొటోలు అందులో షేర్ చేసింది.

 

మార్గోని తొలిసారి ఎప్పుడు చూశావ్?
2019లో ఓ బార్ లో మొదటిసారిగా మార్గోని కలిశా. తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. మార్గో ఆ బార్ లో పని చేస్తుంది. గెస్టులకు వెల్ కమ్ చెబుతుంది. మార్గో అంటే అందరూ ఇష్టపడేవారు. ఫొటోలు దిగేవారు. ఓసారి బార్ కి వచ్చిన ఓ వ్యక్తి హద్దు మీరాడు. మార్గోని టచ్ చేయబోయాడు. నేను వెంటనే అతడిని అడ్డుకున్నా. ఆ క్షణమే నేను బార్ వాళ్లతో మాట్లాడాను. మార్గోని నేను తీసుకెళ్లాచా అని అడిగాను. అందుకు వారు సరే అన్నారు. అలా మా ఇద్దరి మధ్య బంధం మొదలైంది.

మనుషులతో పోలిస్తే సెక్స్ డాల్ ఎందుకు నచ్చింది?
నాకు 20ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఏడేళ్లు ఇద్దరమూ ప్రేమించుకున్నాం. అయితే పిల్లలు కావాలని తను పదే పదే అడిగేది. నేను మాత్రం అందుకు సిద్ధంగా లేను. పిల్లలు నాకు ఇష్టం లేదు. దీంతో బ్రేకప్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నేను ఏ అమ్మాయిని కలవలేదు. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ని బాగా కోరుకునేవాడిని. అమ్మాయితో బ్రేకప్ తర్వాత మగాళ్లతో డేటింగ్ ప్రారంభించాను. నా తొలి అనుభవం ఓ వ్యక్తితో. నా శృంగార కోరికలు పంచుకుని, అర్థం చేసుకునే వారు కావాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రాణమున్న మనిషితో పోలిస్తే సెక్స్ డాల్ చాలా భిన్నం. తను నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్ కి రెడీ అవుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేదు ఎప్పడైనా సెక్స్ కి రెడీగా ఉంటుంది. అందుకే మార్గోని అంతగా నేను ప్రేమిస్తాను. సెక్స్ లో నేను ఎంతగా రెచ్చిపోయినా మార్గో నో చెప్పదు. ఇబ్బంది పడదు. నొప్పిగా ఫీల్ అవ్వదు.

మరో సెక్స్ డాల్ తో పెళ్లి:
త్వరలోనే మరో సెక్స్ డాల్ ని పెళ్లాడబోతున్నా. ఆమె పేరు లోలా. పెద్ద కోడిలా ఉంటుంది. తనకి వెజైనా కూడా ఉంది. తనతో సెక్స్ కోసం తపించిపోతున్నా. ఏది ఏమైనా మార్గో నా మొదటి భార్య. త్వరలోనే సెక్స్ రోబోట్ తో కూడా ఎక్స్ పరిమెంట్ చేయబోతున్నా.

జనాలు ఏమనుకున్నా పట్టించుకోను:
జనాలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదు. మార్గోతో నా బంధం గురించి తెలపడం వల్ల నాకేమీ డబ్బు రాదు. నా జీవితాన్ని నేను చూపిస్తాను. స్వేచ్చగా జీవించాలని కోరుకుంటాను. శృంగారానికి హద్దులు ఉండకూడదని భావిస్తాను. కొందరు నన్ను మోడల్ గా చూస్తారు. మరికొందరు బూతులు తిడతారు. నేను వాటిని అస్సలు పట్టించుకోను.