Sleepless Marathon : 11 రోజులు నిద్రలేకుండా ఉన్నాడు.. చివరికి ఏమైంది?

ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి చాలామంది రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అందులో ఒకటి నిద్రలేకుండా రోజుల తరబడి మేలుకుని ఉండటం. ఒక్కరోజు నిద్రపోకుండా ఉండలేం.. అలాంటి రికార్డు కొట్టడమంటే మాటలా? టోనీ రైట్ అనే వ్యక్తి ఆ రికార్డు కోసం చేసిన ప్రయత్నం చివరికి ఏమైంది?

Sleepless Marathon : 11 రోజులు నిద్రలేకుండా ఉన్నాడు.. చివరికి ఏమైంది?

Sleepless Marathon

Sleepless Marathon : ఒకరోజు నిద్ర (Sleep) తక్కువ అయితేనే మర్నాడు దాని ప్రభావం మన మీద చాలా ఉంటుంది. పని మీద దృష్టి లేకపోవడం.. చికాకుగా ఉండటం ఇలా మన శారీరక, మానసిక పరిస్థితి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓ వ్యక్తి 11 రోజుల పాటు నిద్ర లేకుండా ప్రపంచ రికార్డు (world record) నెలకొల్పాలనుకున్నాడు. అతని ప్రయత్నం నెరవేరిందా?

Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్

నిద్ర లేకపోతే చాలా రకాల అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఆలోచనలు నిలకడగా లేకపోవడం, రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపించడం, అధిక బరువు (Obesity), బీపీ పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై (mental health) తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ తెలిసీ కూడా టోనీ రైట్ (Tony Wright) అనే వ్యక్తి 11 రోజులు అంటే 266 గంటలు మేలుకొని ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను (Guinness World Record) బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అతను ఈ స్లీప్ లెస్ మారథాన్‌లో (Sleepless Marathon) రికార్డ్ కొట్టలేకపోయాడు కానీ 266 గంటల పాటు మెలకువగానే ఉన్నాడు. ఈ క్రమంలో తను ఎదుర్కున్న మానసిక పరిస్థితిని చెప్పుకొచ్చాడు.

Guinness Record : 46 కీళ్లు విరుచుకుని వరల్డ్ రికార్డ్.. ఈ కుర్రాడు మామూలోడు కాదు

మైండ్ అంతా రకరకాల భావోద్వేగాలతో నిండిపోతుందని.. శక్తి లేకుండా అయిపోయినట్లు అనిపిస్తుందని చెప్పాడు రైట్. అయితే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ మరలా ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చని అన్నాడు. నిద్రపోవడం వల్ల మనుషులు తమ మైండ్ లోని ఆలోచనల్ని షిప్ట్ చేసుకుని రిలాక్స్ అవుతారని ఆ తరువాత కొత్త ఆలోచనలతో మేలుకుంటారని చెప్పాడు. ఇక అన్ని గంటలు మేలుకొని ఉండటం వల్ల తన కళ్లు చాలా అలసిపోయినట్లుగా రైట్ చెప్పాడు.

Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

నిజానికి మిస్టర్ రైట్ 1998లో మాంచెస్టర్ మెట్రో పాలిటన్ యూనివర్సిటీలో (Manchester Metropolitan University) ఉన్నప్పుడే ఈ రికార్డును ని బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ టైంలోనే ఐదురోజుల పాటు మెలకువగా ఉండి ఓ ట్రయల్ వేసాడు. దాని నుంచి పొందిన ప్రేరణతో మరల ఇప్పుడు ఈ రికార్డు కోసం ప్రయత్నం చేసి 11 రోజుల పాటు నిద్ర లేకుండా ఉండగలిగాడు. అంతకు ముందు అంటే 1986లో రాబర్ట్ మెక్ డొనాల్డ్ (Robert McDonald) పేరు మీద ఈ రికార్డు ఉంది. అతను 453 గంటల 40 నిముషాలు నిద్ర లేకుండా గడిపాడు.. అంటే 18 రోజుల 21 గంటల 40 నిముషాలు అన్నమాట. ఇక నిద్రలేకపోతే మనిషి ఎలాంటి తీవ్ర మానసిక, శారీరక అనారోగ్యానికి గురవుతాడో తెలిసిందే. అందువల్లే టోనీ రైట్ ప్రయత్నాన్ని గిన్నిస్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.