లక్కున్నోడు..వెంటాడుతున్న అదృష్టం, ఆరోసారి లాటరీ

లక్కున్నోడు..వెంటాడుతున్న అదృష్టం, ఆరోసారి లాటరీ

Man wins lottery for the sixth time : అదృష్టం అంటే అతడిదేరా…మనకు ఎప్పుడొస్తుందో ఏమో..అంటూ..కొంతమంది నిట్టూర్పు విడుస్తుంటారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా ఆరుసార్లు లాటరీ గెలుచుకున్నాడు. ఐడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ లాటరీ టికెట్లు కొంటుంటాడు. మొత్తం ఐదుసార్లు లాటరీలో గెలిచి డబ్బులు గెలుచుకున్నాడు. తాజాగా..Lottery Scratch Game లో ఏకంగా..$ 250,000 (182 కోట్లకు సమానం) సొంతం చేసుకున్నాడు. మరి..ఇలాంటి వచ్చిన డబ్బుతో ఎంతో కులాసాగా..విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడేమో..అని అనుకుంటున్నారా ?

సంపదను సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెడుతుండడం విశేషం. సొంత రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాల్లో సౌకర్యాల ఏర్పాటుకు వెచ్చిస్తుంటారు. ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లోని వసతులను మెరుగుపరిచేందుకు లాటరీల్లో పాల్గొంటానని తెలిపారు.

I’m proud to help support Idaho schools! #6 decent lotto win. #lucky

Posted by Bryan Moss on Thursday, 28 January 2021