Marburg Death : మార్‌బర్గ్ సోకిన వ్యక్తి మృతి..కరోనా కంటే వేగంగా..

కరోనా కంటే ప్రాణాంతక వ్యాధి మార్‌బర్గ్ వైరస్. ఈ వైరస్ సోకిన వ్యక్తి మరునాడే మృతి చెందాడు.అంటే ఇది ఎంతటి ప్రమాదకారో ఊహించుకోవచ్చు. మార్‌బర్గ్ వైరస్ కరోనా కంటే చాలా చాలా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

Marburg Death : మార్‌బర్గ్ సోకిన వ్యక్తి మృతి..కరోనా కంటే వేగంగా..

Marburg Death

1st Marburg virus death : ఓ పక్క కరోనా మహమ్మారి పీడ వదలనే లేదు. మరోపక్క అంతకంటే ప్రమాదకరమైన వైరస్ లకు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో మార్‌బర్గ్ వైరస్ ప్రజల్ని కకావికలం చేస్తోంది. మార్‌బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి మృతి చెందటంతో అప్పుడే మరో మహమ్మారి అంటే జనాలు హడలెత్తిపోతున్నారు. ఈ మార్‌బర్గ్ వైరస్ సోకిన మరునాడు సదరు బాధితుడు చనిపోవటంతో మరింత భయాందోళనలకు కలుగుతున్నాయి.

కరోనా సోకితే వెంటనే చికిత్స తీసుకోవచ్చు..దీనికి వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు. కానీ మార్‌బర్గ్ వైరస్ కరోనా కంటే చాలా చాలా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మార్‌బర్గ్ వైరస్ సోకితే మరణం తథ్యం అన్నట్లుగా సూచిస్తోంది. ఇది ప్రాణాంతకర వ్యాధి అని హెచ్చరిస్తోంది.

పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలోని గేక్కేడౌలో మార్‌బర్గ్ అనే వైరస్ బారినపడి ఆగస్టు 1న మార్‌బర్గ్ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అతను ఆగస్టు 2నే అంటే వరునాడే మరణించటంతో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇది ఎంతటి ప్రాణాంతక వ్యాధో ఊహించుకోవచ్చు. ఈ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ప్రాణాంతక వైరస్ మార్‌బర్గ్ గురించి డబ్ల్యూహెచ్‌వో మాట్లాడుతు..గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. సోకిన తర్వాత ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ వైరస్ చాలా ప్రమాదకారి అని ఇది సోకితే..రక్తనాళాలు కూడా చిట్లిపోతాయని తెలిపింది. దీని బారినపడితే 24-88 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ, చికిత్సా విధానం కానీ లేవని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వైరస్ కూడా ఎబోలా జాతికి చెందినదేనని పేర్కొంది.

కాగా…ప్రస్తుతం మార్‌బర్గ్ వైరస్ బయటపడిన ప్రాంతంలోనే గతంలో ఎబోలా కూడా బయటపడింది. ఈ వైరస్‌కు కూడా కొవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయి. రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి, రోగి స్రావాలను, రోగి తాకిన ఉపరితలాలను, వస్తువులను తాకడం ద్వారా మార్‌బర్గ్ వ్యాపిస్తుంది. కరోనాతో 1 నుంచి 5 శాతం లోపు మరణాలు సంభవిస్తే దీని వల్ల అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.