Marburg Virus : ప్రాణాంతక వైరస్.. లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?
కరోనావైరస్ ముప్పు తొలగకముందే కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు, ఫంగస్ లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మానవ మనుగడకు సవాల్ విసురుతున్నాయి.

Marburg Virus : కరోనావైరస్ మహమ్మారి ఏడాదికి పైగా ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కాగా, మహమ్మారి తీవ్రత కాస్త తగ్గడంతో జనాలు కొంత ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు, ఫంగీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొత్త వైరస్ లు మానవుడి మనుగడకే సవాల్ విసురుతున్నాయి. తాజాగా ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగులోకి వచ్చింది. తొలి కేసును ఆఫ్రికాలో నిర్థారించారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్‌లో మరణించిన రోగి నుంచి సేకరించిన నమూనాల్లో ఈ ప్రాణాంతక వైరస్ కనుగొన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కాగా, అతడు చనిపోవడానికి ముందు 155మందికి ఈ వైరస్ వ్యాపింపజేసి ఉంటాడని అంచనా వేశారు.
అత్యంత ప్రమాదకరం, 88% వరకు మరణాల రేటు:
గబ్బిలాల ద్వారా సోకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకితే 88% వరకు మరణాల రేటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రక్తస్రావ జ్వరానికి కారణమయ్యే అత్యంత తీవ్రమైన వ్యాధి మార్బర్గ్ వైరస్. ఎబోలా వైరస్ లక్షణాలు కలిగినటువంటి ఈ వైరస్.. కోవిడ్-19 మాదిరిగానే జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే.. మార్బర్గ్ వైరస్ ప్రమాదకరమని.. ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. మొదట్లోనే నిలువరించాలని నిపుణులు తేల్చి చెప్పారు. గినియాలో గతేడాది ఎబోలా వైరస్ సోకి 12 మంది మరణించారు. ఆ వైరస్‌ను అరికట్టిన నెలల్లోనే మార్బర్గ్ కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ అంది. ఈ వ్యాధికి ఇంకా ఎలాంటి మందులు కానీ చికిత్స కానీ లేకపోవడం ఆందోళన కలగించే అంశం. ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది.
గబ్బిలాల నుంచి వ్యాప్తి…
పశ్చిమ ఆఫ్రికాలో ఆరోగ్య అధికారులు ఇప్పుడు వైరస్ సోకిన వ్యక్తితో సంబంధం ఉన్న 155 మందిని పర్యవేక్షిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా ఆగ్నేయ గినియాలోని గ్యుకెడౌలో వ్యక్తి మరణించాడు. కాగా, 2014-2016 లో ఇదే చోట ఎబోలా వ్యాప్తి చెందింది.
మార్బర్గ్ వైరస్ సాధారణంగా గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. ఆ తర్వాత కోవిడ్-19 మాదిరిగానే అత్యంత వేగంగా.. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని.. వైరస్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది సోకితే 88శాతం వరకు మరణం సంభవించే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కాగా.. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ కనుగొనడం ఇదే మొదటిసారింది. ఈ వైరస్.. లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అసౌకర్యంతో అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఎబోలా, మార్బర్గ్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే, మార్బర్గ్ వైరస్ కోసం ఇంకా నిర్దిష్ట ఔషధం లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. సహాయక సంరక్షణ మాత్రమే ఉంది.
మార్బర్గ్ వ్యాధి అంటువ్యాధి. రక్తస్రావ జ్వరానికి కారణమవుతుంది. 1967లో మార్బర్గ్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒకేసారి సంభవించిన రెండు పెద్ద వ్యాప్తి వ్యాధిని ప్రాథమికంగా గుర్తించడానికి దారితీసింది. ఈ వ్యాప్తి ఉగాండా నుండి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఆకుపచ్చ కోతులను ఉపయోగించి ప్రయోగశాల పనితో ముడిపడి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.
మార్బర్గ్ వైరస్ వ్యాధితో మానవ సంక్రమణం మొదట్లో రౌసెట్టస్ గబ్బిలాల కాలనీలు నివసించే గనులు లేదా గుహలకు సుదీర్ఘకాలం బహిర్గతం కావడం వలన సంభవించింది. ఒక వ్యక్తికి వైరస్ సోకిన తర్వాత అది విరిగిన చర్మం, శ్లేష్మం, స్రావాలు, రక్తం మరియు ఈ ద్రవాలతో కలుషితమైన ఉపరితలాలు మరియు పదార్థాల ద్వారా ప్రత్యక్ష సంబంధాల ద్వారా మానవునికి మానవులకు వ్యాపిస్తుంది.
చికిత్స:
రీహైడ్రేషన్, రోగలక్షణ చికిత్సతో ప్రారంభ సహాయక సంరక్షణ మనుగడ అవకాశాలను పెంచుతుంది. వైరస్‌ను తటస్తం చేయడానికి చికిత్స లేదు. కానీ వివిధ రక్త ఉత్పత్తులు, రోగనిరోధక చికిత్సలు, ఔషధ చికిత్సలు ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్నాయి.
వ్యాధి లక్షణాలు..
2 నుండి 21 రోజుల వరకు లక్షణాలు బయటపడతాయి
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యం
కండరాల నొప్పులు
పొత్తికడుపు తిమ్మిరి, నొప్పి, తీవ్రమైన నీటి విరేచనాలు, వికారం కూడా మూడవ రోజు ప్రారంభమవుతుంది.
విరేచనాలు ఒక వారం పాటు ఉండవచ్చు.
వైరస్ బారిన పడిన ఈ సమయంలో రోగిలో దెయ్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
లోతైన కళ్ళు, తీవ్రమైన బద్ధకం, వ్యక్తీకరణ లేని ముఖాన్ని చూపుతుంది.
కొన్ని రకాల రక్తస్రావాలు
ముక్కు, చిగుళ్ళు, యోని నుంచి రక్తం
వాంతులు, మలం నుంచి రక్తం కనిపిస్తుంది
తీవ్రమైన అనారోగ్యం కేసుల్లో లక్షణాలు బయటపడిన 8 నుం 9 రోజుల్లోనే మరణం
రోగ నిర్ధారణ..
మలేరియా, టైఫాయిడ్ జ్వరం, మెనింజైటిస్, షిగెలోసిస్, వైరల్ రక్తస్రావ జ్వరం వంటి ఇతర అంటు వ్యాధులను నిర్ధారించినంత సులువుగా మార్ బర్గ్ వైరస్ ను నిర్ధారించడం కష్టం.
వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించడానికి ఉపయోగించే డయాగ్నస్టిక్ పద్ధతులు..
యాంటీబాడి క్యాప్చర్ ఎంజైమ్
యాంటిజెన్ క్యాప్చర్ డిటెక్షన్ టెస్టులు
సీరమ్ న్యూట్రలైజేషన్ టెస్ట్
రివర్స్ ట్రాన్సి
-రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్-పాలిమరేస్ చైన్ (RT-PCR) అస్సే
ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ
సెల్ కల్చర్ వైరస్ ఐసోలేటేడ్
రోగుల నుంచి సేకరించిన శాంపుల్స్ చాలా ప్రమాదకరమైనవి. వాటిని ఎంతో జాగ్రత్తగా ల్యాబ్ కి తీసుకెళ్లాలి. ఒక చోటు నుంచి మరో చోటుకి రవాణా చేసే సమయంలో చాలా భద్రంగా ట్రిపుల్ ప్యాకింగ్ పద్ధతిలో తీసుకెళ్లాలి. ఏమాత్రం తేడా వచ్చినా వాటిని తీసుకెళ్తున్న వ్యక్తి రోగాల బారిన పడటం ఖాయం. అతడి ప్రాణానికే ప్రమాదం.
- Omicron Variant: కళ్లలో ఈ తేడా గమనించారా లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్ కావొచ్చు
- Omicron Variant: ఒమిక్రాన్ రెండు కొత్త లక్షణాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక!
- Delmicron: ఒమిక్రాన్ తర్వాత డెల్మిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్..
- You’re Healthy : మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో..ఇలా తెలుసుకోండి..!
- Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే
1Esha Gupta: కవ్వించే అందాలతో నిషా ఎక్కిస్తోన్న ఈషా
2iQOO Neo 6 5G : iQOO Neo 6 వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
3childredn theft money: ఇంట్లో డబ్బు దాచిన పేరెంట్స్.. ఎత్తుకెళ్లిన పిల్లలు.. ఏం చేశారంటే
4Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?
5Hyderabad Weather: హైదరాబాద్లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
6ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్డ్రా చేయొచ్చు!
7Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సౌత్ తారల సందడి!
8Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
9MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
10Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
-
Dandruff : వేధించే చుండ్రు సమస్య!
-
NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!