Massive Facebook Hack: భారీ ఎత్తులో ఫేస్‌బుక్ హ్యాకింగ్.. ఆన్‌లైన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ ఫోన్ నెంబర్

ఫేస్‌బుక్ భారీ ఎత్తులో హ్యాకింగ్ కు గురైంది. దాదాపు 500మిలియన్ మంది యూజర్ల అకౌంట్లు శనివారం హ్యాక్..

Massive Facebook Hack: భారీ ఎత్తులో ఫేస్‌బుక్ హ్యాకింగ్.. ఆన్‌లైన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ ఫోన్ నెంబర్

Facebook

Massive Facebook Hack: ఫేస్‌బుక్ భారీ ఎత్తులో హ్యాకింగ్ కు గురైంది. దాదాపు 500మిలియన్ మంది యూజర్ల అకౌంట్లు శనివారం హ్యాక్ అయ్యాయి. అందులో మార్క్ జూకర్ బర్గ్ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ జనవరిలోనే దొంగిలించారు. ఇదంతా మొబైల్ నెంబర్లతో లింక్ అయి ఉన్న ఫేస్ బుక్ అకౌంట్లపైనే జరిగింది.

ఫలితంగా పెద్ద ఎత్తులో డేటాబేస్ ను లీక్ అయింది. శనివారం బేసిక్ డేటా స్కిల్స్ తో లీక్ చేసినట్లు చెప్తూ హ్యాకర్ ఫోరంలో దీనిని పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్.. ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. కానీ, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ డేవ్ వాకర్ పాయింట్ చేస్తూ.. సీఈఓ కూడా ఇందులో బాధితులే అని చెప్పింది.

ఫేస్ బుక్ లీక్ ఆధారంగా 533 మిలియన్ మంది డేటా లీక్ అయిందట. అనుకోకుండా ఇందులో మార్క్ జూకర్ బర్గ్ కూడా ఉండటం దురదృష్టం. జూకర్ బర్గ్ ఫోన్ నెంబర్ తో సహా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆన్ లైన్ లో పెట్టేశాడు.