100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 06:16 AM IST
100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత

100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత చేరారు. షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ (Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ షేరు జోరందుకుంది. 6.5 శాతానికి ఎగిరి..265 డాలర్ల ఎగువన ముగిసింది. ఫేస్ బుక్ లో 13 శాతం వాటా కలిగిన మార్క్ జుకర్ బర్గ్ వ్యక్తిగత సంపద తొలిసారి 100 బిలియన్ డాలర్లను తాకినట్లైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ సరసన నిలిచారు.



యూఎస్ మార్కెట్ లో రీల్..
టిక్ టాక్ కు చెక్ పెడుతూ..యూఎస్ మార్కెట్ లో షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ ను ఫేస్ బుక్ యూఎస్ మార్కెట్ లో బుధవారం రిలీజ్ చేసింది. గురువారం ఒక్కసారిగా దీని షేర్ జోరందుకుంది. నాస్ డాక్ 11 వే పాయింట్ల మార్క్ ను దాటి ముగిసింది. ఇందుకు టెక్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నాయి.



2020 ఇప్పటి వరకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద 75 బిలియన్ డాలర్లకు పైగ ఎగిసింది. జుకర్ బర్గ్ సంపద సైతం 22 బిలియన్ డాలర్ల మేర బలపడింది. మరోవైపు రిలయెన్స్ కూడా జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.



డిజిటల్, టెలికాం విభాగం రిలయెన్స్ జియోలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. సంస్థ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 22 బిలియన్ డాలర్ల మేర పుంజుకున్న సంగతి తెలిసిందే. ముకేశ్ సంపద 80 బిలియన్ డాలర్లను అధిగమించింది.