బిగ్ షాక్ : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇంటిగ్రేషన్

ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మరో భారీ ప్లాన్‌కు స్కెచ్ వేశారా? ప్రముఖ సోసల్ మేసేజింగ్ సర్వీసులు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఇంటిగ్రేట్(ఒక్కటి) చేయనున్నారా? ఇకపై ఈ మూడు ప్లాట్‌ఫామ్స్ ద్వారా మేసేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 06:25 AM IST
బిగ్ షాక్ : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇంటిగ్రేషన్

ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మరో భారీ ప్లాన్‌కు స్కెచ్ వేశారా? ప్రముఖ సోసల్ మేసేజింగ్ సర్వీసులు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఇంటిగ్రేట్(ఒక్కటి) చేయనున్నారా? ఇకపై ఈ మూడు ప్లాట్‌ఫామ్స్ ద్వారా మేసేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మరో భారీ ప్లాన్‌కు స్కెచ్ వేశారా? ప్రముఖ సోషల్ మేసేజింగ్ సర్వీసులు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఇంటిగ్రేట్(అనుసంధానం) చేయనున్నారా? ఇకపై ఈ మూడు ప్లాట్‌ఫామ్స్ ద్వారా మేసేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా?  అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

 

వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య యూజర్ల డాటా లీక్ అంశం ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. తరుచుగా వినియోగదారుల సమాచారం దుర్వినియోగం కావడం వివాదంగా మారింది. ఫేస్‌బుక్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిన్నింటికి చెక్ చెప్పేలా మార్క్ జుకర్‌బర్గ్ పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం అందుతోంది. ఫేస్‌బుక్ మెసేంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను మెర్జ్ చేసే పనిలో పడ్డారట. ఈ మూడు సర్వీసులు స్టాండ్ లోన్ యాప్స్‌లానే ఆపరేట్ అవుతాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ఒక్కటి చేస్తారు. ఇలా చేయడం ద్వారా మూడు యాప్‌ల ద్వారా మేసేజ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. యూజర్లకు బెస్ట్ మేసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకురావడమే తమ లక్ష్యం అని జుకర్ బర్గ్ తెలిపారు. 2020కల్లా ఈ పని పూర్తి చేస్తామంటున్నారు.

 

దీని వెనుక మరో కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు తరుచుగా కొత్త ఫీచర్లు తీసుకురావాల్సి వస్తోంది. దీనికి చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇలా మూడింటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఆ ఆర్థిక భారం తప్పుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీని వెనుక బిజినెస్ కోణం కూడా ఉందని తెలుస్తోంది. మూడింటిని అనుసంధానం చేయడం ద్వారా బిజినెస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

అదే సమయంలో ఈ ప్రక్రియపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇలా లింక్ చేయడం వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందంటున్నారు. వినియోగదారుల డేటా దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోని జుకర్ బర్గ్ తన పనిలో తాను ఉన్నారట.