Water on Mars: మార్స్ మీదా నీళ్లు ఉండేవట.. అవేమయ్యాయో తెలుసా?

విశ్వంలో మార్స్ తలంపై నీటి నిల్వలు ఉండేవట. బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఆ పరిణామం వెనుక కారణాలేమిటి. అక్కడ నీరు ఏమైంది? దీనిపై సైంటిస్టుల కొత్త హైపోథెసిస్ ఏం చెబుతోంది. 'రీసెర్చర్లు 30 నుంచి 99శాతం వరకూ మినరల్స్ గా మారిపోయాయి.

Water on Mars: మార్స్ మీదా నీళ్లు ఉండేవట.. అవేమయ్యాయో తెలుసా?

Water On Mars

Water on Mars:  విశ్వంలో మార్స్ తలంపై నీటి నిల్వలు ఉండేవట. బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఆ పరిణామం వెనుక కారణాలేమిటి. అక్కడ నీరు ఏమైంది? దీనిపై సైంటిస్టుల కొత్త హైపోథెసిస్ ఏం చెబుతోంది.

‘రీసెర్చర్లు 30 నుంచి 99శాతం వరకూ మినరల్స్ గా మారిపోయాయి. ఇప్పుడదంతా అక్కడే ఉన్న మట్టిలా ఉపరితలంలో కనిపిస్తుంది. దాదాపు మూడు బిలియన్ సంవత్సరాల క్రితం.. మార్స్ పై ఉండే నీటి నిల్వలన్నీ మట్టిలో కలిసిపోయి పొడి మట్టిగా మారిపోయింది’ అని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీహెచ్‌డీ అభ్యర్థి ఈవా షెల్లర్ అంటున్నారు.

చరిత్ర తొలినాళ్లలో మార్స్ గ్రహంపై దాదాపు అట్లాంటిక్ సముద్రం అంత మొత్తంలో నీరు ఉండేది. గ్రహం మొత్తాన్ని 1.5కిలోమీటర్ల మందంగా కప్పేయగల నీటి సామర్థ్యంతో ఉండేదట.

వాటర్ ఒక ఆక్సిజన్, రెండు హైడ్రోజన్ పరమాణువులతో ఉంటుంది. హైడ్రోజన్ ఐసోటోప్ లేదా వేరియంట్‌ను డ్యూటోరియం అంటారు. మార్స్ పై నీరు కనుమరుగైన విషయం దీనిపై పరిశోధనలోనే తెలిసింది. చాలా హైడ్రోజన్ అణువుల్లో కేవలం సింగిల్ ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. అది కూడా అటామిక్ న్యూక్లియస్ పరిధి లోబడి మాత్రమే. ఇది ప్రొటాన్, న్యూట్రాన్ లను బూస్ట్ చేస్తుంది.

డ్యుటేరియం కంటే ఆర్డినరీ హైడ్రోజన్ వాతావరణంలోని శూన్యంలోకి ముందుగా వెళ్లిపోతుంది. హైడ్రోజన్ ఐసోటోప్ కాంపోజిషన్, మార్స్ పై వాటర్ వాల్యూమ్ మోడల్ ను వాడి రీసెర్చర్లు స్టడీ నిర్వహించారు.

ఈ మోడల్ లో మూడు కీలకమైన ప్రక్రియలు ఉన్నాయి. వొల్కానిజం నుంచి ఇన్‌పుట్ గా వాటర్, వాతావరణంలోకి నీరు వెళ్లిపోవడం, అక్కడే ఉన్న మట్టిలో వాటర్ కలిసిపోవడం. ఈ మోడల్ తో మన హైడ్రోజన్ ఐసోటోప్ డేటా సెట్ జత అవుతుంది. దానిని బట్టే అక్కడి మట్టిలో లేదంటే స్పేస్ లో ఎంత నీరు కలిస్తుందనేది చెప్పగలమని అంటున్నారు.

గ్రహం నుంచి పెద్ద మొత్తంలో నీరు ఏమీ కోల్పోలేదని అంటున్నారు రీసెర్చర్లు. మినరల్ నమూనా ప్రకారం.. అక్కడి మట్టిలో చాలా మినరల్స్ కలిసిపోయినట్లు అక్కడి బురద ఆనవాళ్లు వంటివి ప్రతిబింబిస్తున్నాయి. ‘పెద్ద శిలలో దాగి ఉన్న నీరు, మినరల్ బయటపెట్టడానికి చాలా పెద్ద టాస్క్ట్ ఉంటుంది. ఆ మొత్తాన్ని వేడి చేయగలిగితే వాటర్ విడుదల అవుతుంది.