Home » International » పాక్ ఎప్పుడూ చెప్పేదే : తీవ్రవాది మసూద్ మంచాన పడ్డాడు
Publish Date - 4:17 am, Fri, 1 March 19
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బయటికి వచ్చే పరిస్థితుల్లో కూడా అతడు లేడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి శుక్రవారం(మార్చి-1,2019) తెలిపారు.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్
భారత్ కనుక మసూద్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కోర్టులో నిలబడే సాక్ష్యాధారాలను అందిస్తే పాక్ ప్రభుత్వం అతడిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారత్ తమకు సాక్ష్యాదారాలు అందించాలని, దీనివల్ల తమ ప్రజలకు, పాకిస్తాన్ స్వతంత్ర న్యాయవ్యవస్థను తాము కన్విన్స్ చేయగలమని తెలిపారు. లీగల్ ప్రాసెస్ ను సంతృప్తి పర్చాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి ప్రక్రియలో భాగంగానే భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా ఖురేషి తెలిపారు.
Read Also : అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని కొన్నేళ్లుగా ఐక్యరాజ్యసమితిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే
Movie Theaters: థియేటర్లు మూయాల్సిందే.. లేకుంటే పెను ప్రమాదమే!
T20 World Cup: హైదరాబాద్కు చోటు.. పాకిస్తాన్ మ్యాచ్లు ఢిల్లీలో.. ఫైనల్ మోడీ స్టేడియంలో!
భారత్లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి
కరోనా విజృంభణకు ఆ రెండే ముఖ్య కారణం : ఎయిమ్స్ చీఫ్
నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం
TV Sets : దటీజ్ ఇండియా.. 136కోట్ల జనాభా గల దేశంలో 30కోట్ల ఇల్లుంటే, 21కోట్ల టీవీలున్నాయి