సర్జికల్ స్ట్రయిక్స్ నిజమే : ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు

అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్‌లోని జైషే

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 03:21 PM IST
సర్జికల్ స్ట్రయిక్స్ నిజమే : ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు

అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్‌లోని జైషే

అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్  ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని స్వయంగా జేషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సోదరుడు మౌలానా అమ్మర్ అంగీకరించాడు. అంతేకాదు సర్జికల్ ఎటాక్‌లో ఐఎస్ఐ కల్నల్ సలీం ఖరీ, జైషే సంస్థ టెర్రరిస్ట్ ట్రైనర్ మొయిన్ హతమయ్యారని చెప్పాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది.

2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున.. భారత యుద్ధ విమానాలు ఐఎస్ఐ స్థావరాలు, పాక్ ఆర్మీ పోస్టుల జోలికి వెళ్లకుండా బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ శిబిరంపైనే దాడులు చేశాయని అమ్మర్ చెబుతున్నట్టుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. జైషే సంస్థ హెడ్‌క్వార్టర్‌పై ఎలాంటి దాడి జరగలేదని, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రాంతాల్లోనే దాడులు జరిగాయని, పాక్ ఆర్మీపై భారత్ దాడి చేయలేదని ఆ క్లిప్‌లో ఉంది. అంతేకాదు, భారత వింగ్ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేసినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేయడం కూడా ఆ ఆడియో రికార్డింగ్‌లో వెల్లడైంది.  ”భారత విమానాలు.. జిహాద్ శిక్షణ ఇచ్చే కేంద్రాలపై మాత్రమే బాంబుల వర్షం కురిపించాయి. ఇతర ఏజెన్సీలపైనా, వాటి ప్రధాన కార్యాలయాలపైనా, పాక్ ఆర్మీపైనా దాడులు చేయలేదు. అభినందన్‌ను వదిలేసి ప్రధాని ఇమ్రాన్ తప్పు చేశారు” అని అమ్మర్ ఆ ఆడియో క్లిప్‌లో చెప్పడం ఉంది.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 26న సర్జికల్ స్ట్రయిక్స్ జరిపింది. బాలాకోట్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ  శిబిరం లక్ష్యంగా వెయ్యి కిలోల బాంబులు జారవిడిచింది. టెర్రరిస్టుల క్యాంపులను నేలమట్టం చేసింది. ఈ భీకర దాడిలో 350మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతర్జాతీయంగా ఈ దాడులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దాడులు జరిగింది తమపైనే అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఇప్పుడు మౌలానా అమ్మర్ చేసిన వ్యాఖ్యలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సర్జికల్ స్ట్రయిక్స్‌పై పాకిస్తాన్ పచ్చి అబద్దాలు చెప్పింది. భారత్ అసలు దాడే చేయలేదని బుకాయించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బుకాయించింది. కావాలంటే బాలాకోట్ తీసుకెళ్లి చూపిస్తామని వాగింది.