Nigeria Blast : నైజీరియాలో భారీ పేలుడు.. 100 మందికిపైగా సజీవదహనం

దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు.

Nigeria Blast : నైజీరియాలో భారీ పేలుడు.. 100 మందికిపైగా సజీవదహనం

Nigeria

Massive blast in Nigeria : నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా సజీవదహనం అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు. రివర్స్, ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో ఈ ఘటన జరిగిందని రివర్స్‌ స్టేట్‌ పోలీస్‌ ప్రతినిధి గ్రేస్‌ ఇరింగే కోకో తెలిపారు.

Gujarat : గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి

ఆఫ్రికాలో భారీగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నైజీరియా కూడా ఒకటి. అక్కడ రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్‌ ఉత్పత్తి అవుతుంది. అయితే నైజీరియాలో అక్రమంగా ముడిచమురును శుద్ధిచేయడం సర్వసాధారణం. పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి ముడిచమురు దొంగిలించిన తర్వాత దానిని శుద్ధి చేసి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తారు.