China Covid-19 : చైనాలో మళ్లీ క్వారెంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం

చైనాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ క్వారెంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టింది.

China Covid-19 : చైనాలో మళ్లీ క్వారెంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం

quarantine sites being built in China's Govt Guangzhou as Covid cases spiral

China Covid-19 : ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంది. కానీ కోవిడ్ పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాను మాత్రం ఆ పాపం వదలటంలేదు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి చైనా దేశ వ్యాప్తంగా దీంతో కోవిడ్ ఆంక్షల్ని విధిస్తోంది ప్రభుత్వం. అయినా కేసులు పెరుగుతునే ఉన్నాయి.జీరో కోవిడ్ పాలసీతో ప్రభుత్వం కోవిడ్ ను ఖతం చేయటానికి యత్నిస్తోంది. కానీ కేసులు మాత్రం పెరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో చైనా ప్రభుత్వం మరోసారి ప్రత్యేక క్వారంటైన్ సెంటర్ల నిర్మాణం చేపట్టింది.

రోజు వారీ కేసులు 40 వేలకు అటూ ఇటూగా నమోదవుతుండడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు నగరాలలో క్వారెంటైన్ గదులు, ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. మేక్ షిఫ్ట్ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ కట్టడాలను కరోనా బాధితులను క్వారెంటైన్ లో ఉంచటానికి నిర్మిస్తున్నారు.సుమారు 1.30 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్వాంగ్జూ సిటీ శివార్లలో ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ్వాంగ్జూ సిటీలో నిర్మిస్తున్న తాత్కాలిక ఆసుపత్రులు, క్వారెంటైన్ సెంటర్లలో 2 లక్షల 50వేల మంది వైరస్ బాధితులకు ఆశ్రయం కల్పించవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇటీవల సిటీలో కరోనా బారిన పడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని..కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రోజువారీ కేసులు ఈ సిటీలోనే 7 వేల దాకా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఇతర మెగా సిటీల్లోనూ వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతోంది.వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అమలుచేస్తున్న జీరో కొవిడ్ పాలసీతోనూ ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే కేసుల పెరుగుదల చూస్తుంటే ఏమైతే అది అవుతుంది అన్నట్లుగా ఉంది కోవిడ్ ఆంక్షలతో విసుగెత్తిపోయిన జనాల పరిస్థితి చూస్తుంటే. జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వస్తు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు పెరుగుదల ఏమాత్రం ఆగటంలేదు. కానీ బాధితులలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవటం విశేషం.