Chicken Nugget : వామ్మో.. ఈ చికెన్ పీస్ ధర రూ.73లక్షలు.. ఎందుకంత రేటు అంటే..

కొందరికి నాన్-వెజ్ అంటే మహా ఇష్టం. అందులోనూ చికెన్ అంటే మరీనూ. ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతి రోజూ లెగ్ పీస్ ఉండాల్సిందే అంటారు.

Chicken Nugget : వామ్మో.. ఈ చికెన్ పీస్ ధర రూ.73లక్షలు.. ఎందుకంత రేటు అంటే..

Mcdonalds Chicken Nugget Sells For Rs 73 Lakh Online

Chicken Nugget : కొందరికి నాన్-వెజ్ అంటే మహా ఇష్టం. అందులోనూ చికెన్ అంటే మరీనూ. ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతి రోజూ లెగ్ పీస్ ఉండాల్సిందే అంటారు. కాగా, చికెన్‌తో తయారు చేసే ఎంత ప్రత్యేకమైన వంటకమైనా.. రూ.10వేలకు మించి ఖరీదు చేయదు. అయితే, ఈ సింగిల్ చికెన్ ముక్క మాత్రం ఏకంగా రూ.73 లక్షల ధర పలికింది. ఏంటి..షాక్ అయ్యారా.. కానీ, ఇది నిజం.

ఫాస్ట్‌ఫుడ్ వంటకాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ మెక్‌డొనాల్డ్స్. ఈ సంస్థ చికెన్ వెరైటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాగా, మెక్ డొనాల్డ్ తమ చికెన్ నగ్గెట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన చికెన్ నగ్గెట్ ఏకంగా 99వేల 997 డాలర్లు ధర పలికింది. భారత కరెన్సీ ప్రకారం.. సుమారు 73 లక్షలు. అదేంటీ? ఒక చికెన్ ముక్కకు అంత ధర ఎందుకు? దాని ప్రత్యేకత ఏమిటనేగా మీ ప్రశ్న. ‘అమాంగ్ అస్’(Among Us) అనే ఓ వీడియో గేమ్‌లోని ఓ పాత్ర ఆకారంలో ఆ చికెన్ నగ్గెట్‌ను తయారు చేశారు.

ఆ గేమ్‌ను ఎంతో ఇష్టపడే చికెన్ ప్రియులు.. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ కొరియన్ బ్రాండ్ బీటీఎస్ స్ఫూర్తితో తయారు చేసిన ఈ చికెన్ నగెట్‌ను eBayలో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పెట్టగానే జనాలు ఎగబడ్డారు. చివరికి నిర్వాహకులు సైతం నమ్మలేనంత మొత్తంతో దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి ఆ చికెన్ ముక్కను ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి దాదాపు రూ.73 లక్షలకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

మొత్తంగా.. ఓ చికెన్ ముక్క కోసం రూ.73లక్షలు ఖర్చు పెట్టడం ఇప్పుడు ప్రపంచ వింతగా మారింది. ఈ న్యూస్ వైరల్ అయ్యింది. వామ్మో.. చికెన్ ముక్క కోసం అంత డబ్బు వేస్ట్ చేశాడా? అని విస్తుపోతున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదే కాబోలు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అదే డబ్బు మనకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని మరికొందరు అంటున్నారు.