Unisex Bathroom : వివాదంగా మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అధికారులు

కొత్తగా ఏదో చేద్దామనుకుంటే చెత్తగా మారింది అన్నట్లుగా ఉంది ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్‌ పరిస్థితి. కొత్తగా రూపొందించిన బాత్రూమ్ వివాదంగా మారి అధికారులు వార్నింగ్ ఇచ్చేవరకు వెళ్లింది.

Unisex Bathroom : వివాదంగా మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అధికారులు

Mcdonalds Restaurant A Controversy With Its Unisex Bathroom

McDonalds Restaurant A Controversy With Its Unisex Bathroom : కొత్తగా ఏదో చేద్దామనుకుంటే చెత్తగా మారింది అన్నట్లుగా ఉంది ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్‌ వేసిన ప్లాన్. వినూత్నంగా ఆలోచించి వెరైటీ రూపొందించినది కాస్తా బెడిసికొట్టింది. అదేదో కొత్త ఫుడ్ ఐటెమ్ అనుకుంటున్నారా? కాదు. బాత్రూమ్ విషయంలో మెక్‌డొనాల్డ్స్‌ కొత్త ఆలోచన అట్టర్ ప్లాప్ అయ్యింది. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించి ఓ కొత్త బాత్రూమ్ ని రూపొందించింది. ఈ బాత్రూమ్ ఆడవారికి, మగవారికి ఒకేటే అన్నట్లుగా రూపొందించి ఆ బాత్రూమ్ కాస్తా వివాదంగా మారింది.ఏకంగా అధికారులే మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన బాత్రూమ్ విషయంలో కల్పించుకుని వార్నింగ్ ఇచ్చేలా చేసింది.

Read more : టెక్ ట్రాన్పరెంట్ టాయిలెట్స్‌ : ఏం సిగ్గు పడక్కర్లేదు

ఇంతకీ ఆ బాత్రూమ్ ఏంటీ అంటే..బ్రెజిల్‌లోని ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ‘యూనిసెక్స్’ టాయిలెట్‌ బాత్‌రూమ్‌ వివాదంగా మారింది. బ్రెజిల్‌లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఉన్న ఓ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయిలెట్‌ బాత్‌రూమ్‌ ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్‌డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకేలాంటి టాయిలెట్‌ రూమ్‌ లేంటి అంటూ ఒక మహిళ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేయటంతో అదికాస్తా వివాదమైంది. అది ఆడవారు, మగవారే కాదు..చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినయోగిస్తారు? అంటూ ఆమెఒక ఆడియో క్లిప్‌ను కూడా ఆరోగ్య అధికారులకు పంపించారు.

Read more : Hospital Used Toilet Water : 30 ఏళ్లుగా టాయిలెట్‌ నీటినే తాగిన ఆసుపత్రి సిబ్బంది, రోగులు..అస్సలు తెలియనేలేదట..!!

దీంతో ఆరోగ్య అధికారులు రంగంలోకి దిగారు.మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ని సందర్శించారు. ఆ ‘యూనిసెక్స్’ బాత్రూమ్ టాయిలెట్ ను పరిశీలించారు. ఇది ఆరోగ్య నిబంధనలకు విరుద్దం అంటూ సదరు మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కు వార్నింగ్ ఇచ్చారు.అంతేకాదు..ప్రజల ఆ‍రోగ్యాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.

రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఏర్పాటు చేయాలని లేకపోతే రెస్టారెంట్ ను మూసివేయడమో లేదా జరిమాన వేయటమో చేస్తామని ఆరోగ్య అధికారులు రెస్టారెంట్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. దీనిపై సదరు రెస్టారెంట్ వివరణ ఇస్తు..‘మెక్‌డొనాల్డ్స్‌ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించుకునేలా కొంచెం మార్పులు చేస్తు..ఈ బాత్రూంలు రూపొందించామని తెలిపింది. కానీ ఇదిలా వివాదం అవుతుందని అది ప్రజలకు అసౌక్యం కలిగించాలనే ఉద్ధేశ్యంతో కాదని అధికారులు సూచించిన మేరకు మార్పులు చేస్తామని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో అనుకున్నదొక్కటి..అయినది మరొకటి అన్నట్లుగా మారింది బ్రెజిట్ లో ని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ పరిస్థితి.