Nalgonda: నల్గొండ వాసిని మేరీల్యాండ్‌లో కాల్చి చంపిన దుండగులు | MDTA Police Investigating Shooting Death Of Man belongs to Nalgonda

Nalgonda: నల్గొండ వాసిని మేరీల్యాండ్‌లో కాల్చి చంపిన దుండగులు

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన బాల్టిమోర్ సిటీలో నల్గొండ వాసిని హతమార్చారు దుండగులు. ఆదివారం తెల్లవారుజాము సమయంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

Nalgonda: నల్గొండ వాసిని మేరీల్యాండ్‌లో కాల్చి చంపిన దుండగులు

Nalgonda: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన బాల్టిమోర్ సిటీలో నల్గొండ వాసిని హతమార్చారు దుండగులు. ఆదివారం తెల్లవారుజాము సమయంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఉదయం 4గంటల 30నిమిషాల సమయంలో మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు ఓ వాహనంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

హ్యుందాయ్ టక్సన్ కారులో 25ఏళ్ల వ్యక్తి తలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా కనుగొన్నారు. వెంటనే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్ కు తీసుకెళ్లగా.. కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

నల్గొండకు చెందిన నక్క సాయి చరణ్(26) రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మిత్రుడిని ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి కారులో తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. మర్డర్ కేసుగా పరిగణిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also : అమెరికాలో మరోసారి కాల్పులు..బాలుడు మృతి

×