ప్రపంచంలో సగం మందికి ఆక్సిజన్ కరవు..కరోనా కాలంలో పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 10:37 AM IST
ప్రపంచంలో సగం మందికి ఆక్సిజన్ కరవు..కరోనా కాలంలో పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు

ప్రపంచ దేశాల్లో దాదాపు సగం మంది జనాభాకు ప్రాణాధారమైన ఆక్సిజన్ అందుబాటులో లేదని ఓ సర్వే వెల్లడించింది. కరోనా కాలంలో ఇది మరింత సమస్యగా తయారైంది. దీంతో ఆక్సిజన్అందుబాటులో లేక పలు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న విషాద పరిస్థితులు నెలకొన్నాయని.. ముఖ్యంగా ఈ సమస్య పేద దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉందని సర్వేలో వెల్లడైంది.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికించేస్తోంది. అగ్రరాజ్యాలతో పాటు పేద దేశాల పాలిట శాపంగా తయారైంది. కరోనా కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ప్రపంచ దేశాలను విపరీతంగా వేధిస్తోంది. ముఖ్యంగా పేద దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. యూరప్, ఉత్తర అమెరికా వంటి సంపన్న దేశాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ లానే ఆక్సిజన్‌ కూడా ప్రాథమిక అవసరమే. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను పైపుల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని రోగుల బెడ్‌కు పంపిస్తారు. 

కానీ కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో ఈ కొరత మరింతగా పెరిగింది. దాదాపు అన్నిదేశాలు ఆక్సిజన్ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. ఉన్నవాటిని సరిపెట్టుకోలేక అదనంగా సమకూర్చుకోలేక ఆక్సిజన్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

ఆక్సిజన్ సమస్య పెరు నుంచి బంగ్లాదేశ్ వరకు ఉన్న పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ప్రజల ప్రాణాలను హరించివేస్తోంది. ఆఫ్రికా దేశమైన కాంగోలోకేవలం రెండు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంది. అంటే ఇటువంటి దేశాల్లో ఆక్సిజన్ కొరత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అక్కడి ప్రజలకు ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రాణాలో పోతున్న విషాద స్థితి ఉంది. 

మరో ఆఫ్రికా దేశం టాంజానియాలో 8 శాతం, బంగ్లాదేశ్‌లో ఏడు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. అదే గినియాలో అయితే ఒక్క బెడ్‌కు కూడా ఆక్సిజన్ సరఫరా లేదన్న కఠోర వాస్తవం కూడా ఈసర్వేలో  వెల్లడైంది. ప్రపంచంలోని పలు దేశాలను కరోనా వణికిస్తున్న క్రమంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోంది. కానీ డిమాండ్ కు తగినంత ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి నెలకొంది.

ప్రజలు శ్వాసించే హక్కు కూడా డబ్బుపై ఆధారపడి ఉంటోంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, ఆక్సిజన్ ఖరీదైనదిగా మారింది. అంతే కాదు ఆక్సిజన్ ను సమకూర్చుకోవటం కూడా కష్టంగా మారింది. 

Read: రూ.450ల యాంటిజెన్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్‌తో 30 నిమిషాల్లో ఫలితం.. ICMR ఆమోదం