చైనాలో కరోనా రిలీఫ్ డ్యాన్స్ వీడియో వైరల్!..బాధితులు కోలుకుంటున్నారు!!

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 11:27 AM IST
చైనాలో కరోనా రిలీఫ్ డ్యాన్స్ వీడియో వైరల్!..బాధితులు కోలుకుంటున్నారు!!

చైనాలో కరోనా వైరస్ రిలీఫ్ డ్యాన్స్ ఎంతగా ఆకట్టుకుంటోంది. కరోనాపై యుద్ధం చేసిన చైనా వైద్యం సిబ్బంది ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కు కట్టడివేస్తున్నారు. భయపెట్టిన కరోనా వైరస్ కు ఎదురొడ్డి నిలబడ్డారు వైద్య బృందం. కుటుంబ సభ్యులను దూరంగా ఉన్నారు. చిన్నపిల్లలను కూడా ఇంటిలో విడిచి పెట్టి నిద్రాహారాలు మాని నిరంతంర కరోనా బాధితులకు సేవలు చేశారు. తమ ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్క లేయలేదు. బాధితుల కోసం నిరంతరం శ్రమించారు.

వారి మందులు ఇవ్వటం సేవ చేయటమే పరమాధిగా తమ జీవితాలను మార్చేసుకున్నారు. దీంతో కరోనా తోక ముడుస్తోంది. ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతోంది. కరోనా వ్యాధిగ్రస్తులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. దీంతో వైద్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తమ శ్రమ ఫలిస్తున్నందుకు తమ స్థాయిలు మరచి..ఆనదంతో డ్యాన్స్ లు వేస్తున్నారు. కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. డాక్టర్లు వేస్తున్న డాన్స్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

 చైనా వాసులు కరోనావైరస్‌ (కోవిడ్-19) బారిన పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న క్రమంలో క్రమంగా కరోనా నుంచి విముక్తి పొందేందుకు జరుగుతున్న యుద్ధంలో చైనా డాక్టర్లు..వైద్య సిబ్బంది ఇప్పుడిప్పుడే విజయం సాధిస్తున్నారు.కరోనాకు ఇప్పటికే  2700 బలైపోయారు. కానీ బాధితుల మరణాలు నియంత్రించేందుకు..వారు చేయని కృషి అంటూ లేదు. వారి కృషికి ఫలితంగా కరోనా వ్యాధి మరణాలు తగ్గుతున్నాయి. వైరస్ విజృంభణ తగ్గుతోంది. దీంతో ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా వ్యాధిగ్రస్తుల్లో మరింతగా మనోధైర్యాన్ని నింపేందుకు డ్యాన్స్ లు వేసారు. 

చైనాలోని ఓ ఆస్పత్రిలో చేరిన కరోనా వ్యాధిగ్రస్తులు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. చికిత్స కోసం అన్హుయి  మెడికల్‌ కాలేజీలో చేరిన వారిలో ఆరుగురి ఆరోగ్యం కుదుటపడుతోంది. కరోనా నుంచి కోలుకుంటుండటంతో సంతోషం వ్యక్తం చేస్తూ..ఇద్దరు స్టాఫ్‌ మెంబర్లు ఆస్పత్రి నుంచి కిందకు దిగుతూ లిఫ్ట్‌ దగ్గర సంతోషంతో డ్యాన్స్‌  చేశారు. మాస్కులో ఉన్న ఇద్దరు డ్యాన్స్‌ చేసిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.  

See Also>>హాలీవుడ్‌కూ కరోనా ఎఫెక్ట్ – టామ్ క్రూజ్ సినిమా వాయిదా