వ్యాక్సినే కాదు.. ఇక మందు కూడా!

వ్యాక్సినే కాదు.. ఇక మందు కూడా!

Medicine Will Be Available For Covid-19 : ఇనాళ్లు కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్‌ కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. కరోనా వస్తే దాని నుంచి బయట పడేందుకు మెడిసన్‌ కనుగొన్నారు. కరోనా చికిత్సలో అద్భుతంగా పనిచేసే థాప్సిగార్గిన్ అనే ఔషధాన్ని నాటింగ్ హామ్ వర్శిటీ సైంటిస్టులు తయారు చేశారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాల కంటే ఇది ఎన్నో వందల రెట్లు ప్రభావంతమైనది. ఈ యాంటీవైరల్‌ ఔషధం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన కరోనాని నిలువరించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వేళ.. మరో శుభవార్తను నాటింగ్ హామ్ వర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పని చేయగల మందును బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో కరోనా లాంటి మరిన్ని వైరస్‌ కారక మహమ్మారులు తలెత్తినా.. ఇది సమర్థవంతంగా నివారించగలదు. వైరసెస్‌ అనే జర్నల్‌లో సంబంధిత పరిశోధనాంశాలు ప్రచురించారు.

నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా ఔషధాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. వీటిలో భాగంగా థాప్సిగార్గిన్‌ అనే యాంటీ వైరస్‌ ఔషధాన్ని నియమిత మోతాదులో ఇచ్చినప్పుడు.. అది కొవిడ్‌ వైరస్‌పై చక్కగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. ఇది వృక్ష సంబంధ పదార్ధాల నుంచి తయారుచేసినట్టు వారు వివరించారు. కరోనా మాత్రమే కాకుండా శ్వాసక్రియ ద్వారా వ్యాప్తించే మరో రెండు వైరస్‌ వ్యాధులపై ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఒకేసారి వివిధ వైరస్‌లు దాడి చేయటంతో తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. అప్పుడు వాటిని వేర్వేరుగా గుర్తించటం సాధ్యంకాదు. ఇలాంటి సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ వైరస్‌లపై పనిచేసే థాప్సిగార్గిన్‌ లాంటి విస్తృత శ్రేణి ఔషధాలు చికిత్సకు ఉపకరిస్తాయి. వ్యాధి సోకక ముందు, సోకినపుడు కూడా దీనిని వాడవచ్చు. వ్యాధికారక వైరస్‌లు మానవ శరీరంలో మరింత అభివృద్ధి చెందకుండా.. కనీసం 48 గంటలపాటు థాప్సిగార్గిన్‌ రక్షణ కల్పిస్తుంది.