టిక్ టాక్ స్టార్.. ఒక్కో వీడియోకు రూ.18లక్షలు

టిక్ టాక్ స్టార్.. ఒక్కో వీడియోకు రూ.18లక్షలు

దేనినైనా వాడుకోవడం వచ్చి ఉండాలి.. టిక్ టాక్ వాడి కాపురాలు పాడు చేసుకుంటుంటే మరొకరు సెకన్ల పాటు వీడియో చేసి లక్షల్లో దండుకుంటున్నారు. లండన్‌లో ఉండే 23 ఏళ్ల టిక్ టాక్ స్టార్‌గా మారిపోయింది. ఒక్కో వీడియోకు తీసుకునే అక్షరాల రూ.18 లక్షల పారితోషికం తీసుకుంటుంది.

డబ్బు ఇస్తానంటే సరిపోదు ఆమె కాల్ షీట్లు కూడా ఖాళీగా ఉండాలి మరి. అందుకే ఆ దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు ఆమెతో వీడియో చేయించుకోవడం కోసం క్యూలు కడుతున్నాయట. టిక్ టాక్ వీడియోల మీద పాపులరై 1.6 కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు మేడమ్ కదలాలంటే, బాలీవుడ్ స్టార్ మాదిరి భారీసైజు బాడీగార్డులతో కూడా ఉండాలట.

గతేడాది హోలీ అప్‌లోడ్ చేసిన వీడియో ఏకంగా 7.7 కోట్ల వ్యూస్ సంపాదించడంతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె సుడి తిరిగింది. కంపెనీ యాడ్స్ అయితే ఒక్కో వీడియోకు రూ.18 లక్షలు డిమాండ్ చేస్తుందట.

టిక్ టాక్ వీడియోలు పుణ్యమాని ఉన్న చిన్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి యాడ్ లు ఖాళీగా ఉన్నప్పుడు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కాలం గడిపేస్తుందట. ఈమెకు ఉన్న అభిమానుల్లో 80 శాతం మంది అమ్మాయిలే ఉన్నారంటే ఆశ్చర్యపడే విషయమే. మిగిలిన 20 శాతం మాత్రమే అబ్బాయిలు. పియానో వాయించడం ఈమె స్పెషల్ హాబీ.