నుదిటిపై తోకతో పుట్టిన కుక్కపిల్ల

సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది.

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 04:07 AM IST
నుదిటిపై తోకతో పుట్టిన కుక్కపిల్ల

సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది.

సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది. దీంతో ఆ కుక్కకు ఎక్కడా లేని క్రేజ్ లభిస్తోంది. మిస్సోరీలోని జాక్సన్ ప్రాంతంలో ‘మాక్స్ మిషన్’ అనే జంతు సంరక్షణ సిబ్బంది దగ్గర ఉన్న ఈ కుక్కకు రెండు తోకలు ఉన్నాయి. ఒక తోక వెనుక వైపు ఉంటే.. మరొకటి నుదిటి మీద రెండు కళ్ల మధ్యలో మొలిచింది.

10 వారాల వయస్సు గల ఆ కుక్కకు ‘నార్వాల్’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ‘మాక్స్ మిషన్’ వ్యవస్థాపకుడు రాచెల్లె స్టెఫ్ఫెన్ మాట్లాడుతూ.. ఆ కుక్కకు దాని ముఖం మీద అదనంగా ఓ తోక ఉందనే సంగతి తెలియదన్నారు. అది ఆరోగ్యంగా, చలాకీగా ఉందన్నారు. అది తోకలా ఊగదని.. ముఖంపై అదనంగా ఏర్పడిన భాగం మాత్రమే అన్నారు. అయినా సరే, అది చాలా అందంగా కనిపిస్తుందన్నారు. 

నర్వాల్‌ను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు.. దానికి ఫ్యాన్స్ అయిపోతున్నారు. మరికొందరు దాన్ని తమ ఇంట్లో పెంచుకుంటామని కోరుతున్నారు. అయితే దాన్ని ఇప్పట్లో దత్తతకు ఇచ్చే ఉద్దేశం లేదని రాచెల్లె స్పష్టం చేశారు. నుదిటిపై ఉన్న తోక పెద్దదైతే దానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని, ఈ క్రమంలో దాన్ని కొన్నాళ్లు తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని తెలిపారు.