ట్రంప్ మెలానియా విడాకులు ?

10TV Telugu News

Melania to divorce Donald Trump? : అమెరికా ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైట్ హౌస్ ను విడిచిపెట్టిన అనంతరం గుడ్ బై చెప్పేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ కథనం ప్రచురించడం కలకలం రేపుతోంది. వైవాహిక జీవితానికి ఎప్పుడు ముగింపు పలుకుదామా అన్నట్లు మెలానియా భావిస్తోందని ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పినట్లుగా డెయిలీ మెయిల్ వెల్లడిస్తోంది.https://10tv.in/donald-trump-hesitate-leave-play-school-relevant-white-house-video-viral/
అధ్యక్ష పదవి నుంచి వైదొలగగానే..విడాకులు ఇవ్వడానికి మెలానియా సిద్ధంగా ఉన్నారని, అవసరం కోసం వారిద్దరూ కాలం గడిపేస్తున్నారంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అమెరికా అధ్యక్ష పదవి జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే.అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. బైడెన్‌కు ఇప్పటివరకు 290 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షురాలిగా ఇండో ఆఫ్రికన్‌ మూలాలున్న కమలా హారిస్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. అటు బైడెన్‌ గెలుపును ఏ రాష్ట్రం కూడా అధికారంగా ప్రకటించలేదన్నారు ట్రంప్. సోమవారం నుంచి న్యాయపోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

×