మరిచిపోలేకపోతున్నా: మెలానియా ట్రంప్

  • Published By: vamsi ,Published On : February 28, 2020 / 10:13 AM IST
మరిచిపోలేకపోతున్నా: మెలానియా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత్ పర్యటనకు వచ్చిన ఆయన భార్య మెలానియా ట్రంప్.. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ హ్యాపీనెస్‌ తరగతులకు హాజరైన ఆమెకు అక్కడి చిన్నారుల నుంచి అపూర్వ ఆతిధ్యం అందింది. విద్యార్థులతో తాను గడిపిన మధుర క్షణాలను ఆమె చాలా ఎంజాయ్ చేస్తుంది.

అమెరికాకు తిరిగి వెళ్లినా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేని మెలానియా.. ఆమె నిర్వహించే ‘బీ బెస్ట్‌’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు హ్యాపీనెస్‌ తరగతుల ఆశయాలు దగ్గరగా ఉండడంతో ఆమె వాటి గురించి మరింత ఆశ్చర్యపోతుంది. 

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు  మెలానియా ట్రంప్. భారతీయ సంప్రదాయంలో తనకు స్వాగతం పలికినందుకు పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపిన మెలానియా.. అక్కడ చిన్నారులతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నారు. ‘భారత సంప్రదాయ పద్ధతిలో నుదుట బొట్టు పెట్టి, హారతి ఇవ్వడం.. తనకు ఎంతో ఆనందం ఇచ్చిందంటూ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

నాకు స్వాగతం పలికినందుకు సర్వోదయ పాఠశాలకు కృతజ్ఞతలు. అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులు, టీచర్లు మధ్య ఉండే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. పాఠశాలలో గడిపిన క్షణాలు ఎప్పటీకీ మరిచిపోలేను’ అంటూ మెలానియా సర్వోదయ పాఠశాల సందర్శనను గుర్తుచేసుకున్నారు.

అలాగే ‘న్యూఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో రీడింగ్ క్లాస్‌రూమ్ అండ్ హ్యాపీనెస్ కరికులం ప్రోగ్రామ్‌ల ద్వారా స్ఫూర్తి పొందాను… ‘బీ బెస్ట్’ కార్యక్రమాలు అమెరికాకు మాత్రమే పరిమితం కాకూడదు.. ప్రపంచవ్యాప్తంగా చూడాలని అనుకుంటున్నాను అని ఆమె అన్నారు. 

Read More | ద్యావుడా..JCBని ఇలాక్కూడా వాడొచ్చా..!

అంతే కాదు ఆమె డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి తాజ్ మహల్ పర్యటించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో పంచుకుంది.