ATM Machine : పాత ‘ఏటీఎం’ లక్షాధికారిని చేసింది

ఏటీఎం అతని జీవితాన్ని మలుపుతిప్పేసింది. ఒక్కో రోజులో లక్షాధికారి అయిపోయాడు. కొనుగోలు చేసిన ఏటీఎంను పగులగొట్టారు. అంతే..ఆ ఇద్దరూ షాక్ తిన్నారు. అందుల నోట్ల కట్టలు కనబడ్డాయ.

ATM Machine : పాత ‘ఏటీఎం’ లక్షాధికారిని చేసింది

Atm

Old ATM Machine : ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరికి అదృష్టం కలిసివస్తుందో కూడా చెప్పలేం. అప్పటి వరకు పేదరికంలో ఉన్న వ్యక్తి ఒక్క రాత్రిలో లక్షాధికారి, కోటీశ్వరులు అయిపోతారు. అదృష్టం వారి తలుపు తడుతుంది. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు ఉండవు. లాటరీ ద్వారానో..పూర్వీకుల ఆస్తి రావడమో..ఇలా…కొంతమందికి అదృష్టం కలిసివస్తుంది. ఇలాగే జరిగింది ఓ వ్యక్తి విషయంలో. అందుకు కారణం ఏంటో తెలుసా ఏటీఎం. అవును ఆ ఏటీఎం అతని జీవితాన్ని మలుపుతిప్పేసింది. ఒక్కో రోజులో లక్షాధికారి అయిపోయాడు.

Read More : 

ఓ వ్యక్తి…300 డాలర్లు అంటే..భారతీయ కరెన్సీలో రూ. 22 వేల 360 పెట్టి..జంక్ యార్డు నుంచి ఓ ఏటీఎంను కొనుగోలు చేశాడు. అయితే..దానికి సంబంధించిన ‘కీ’ ఇవ్వలేదు. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి ఏటీఎంను ఎలా తెరవాలో అర్థం కాలేదు. చివరకు దానిని పగులగొట్టాలని అనుకున్నాడు. తన మిత్రుడి సహాయం తీసుకుని..దానిని పగులగొట్టారు. అంతే..ఆ ఇద్దరూ షాక్ తిన్నారు. అందుల నోట్ల కట్టలు కనబడ్డాయ. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తంగా అవి 2 వేల డాలర్లున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశారు. క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది ? ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.