అంతరిక్షంలో అరుదైన దృశ్యం

అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. సోమవారం (నవంబర్ 11, 2019) బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లింది.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 01:59 AM IST
అంతరిక్షంలో అరుదైన దృశ్యం

అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. సోమవారం (నవంబర్ 11, 2019) బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లింది.

అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. సోమవారం (నవంబర్ 11, 2019) బుధగ్రహం సూర్యుడిని దాటి వెళ్లింది. అయితే భారత్‌లో మాత్రం ఈ అద్భుతం కనిపించలేదు. బుధగ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలో తిరుగుతుంటుంది. దీంతో అది వలయంలో దాటే క్రమంలో సూర్యుడిపై చిన్న మచ్చలాగా కనిపించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.05 గంటల నుంచి ఐదున్నర గంటలపాటు ఈ అరుదైన దృశ్యం ఆకాశంలో కనువిందు చేసింది. 

దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో మాత్రమే ఇది కనిపించినట్టు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత్‌తోపాటు ఆసియాలోని ఇతర దేశాలు, ఆస్ట్రేలియా, అలస్కాలో దీనిని చూడలేరని ముందుగానే చెప్పారు. దీంతో ఆయా దేశాలకు చెందిన వారు నాసా వెబ్‌సైట్లో ప్రసారమయ్యే లైవ్‌ స్ట్రీమ్‌లో ఈ అద్భుతాన్ని తిలకించారు. 

బుధగ్రహం ఒక శతాబ్దంలో 14 సార్లు మాత్రమే సూర్యుడిని దాటి వెళ్తుందని, ఈ క్రమంలో ఇది నాల్గోసారని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 2032లో మళ్లీ ఇలాంటి అద్భుతం ఆవిష్కతమవుతుందని, అమెరికావాసులు మాత్రం 2049లో మాత్రమే దీనిని స్పష్టంగా చూడగలరని తెలిపారు.