Meta New App: ట్విటర్ తరహాలో మెటా కొత్త యాప్.. నాయకత్వం వహిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ..
ఎలాన్ మస్క్ ప్రవేశపెడుతున్న కొత్త విధానం, చెల్లింపు సేవ వంటి అనేక దశల తర్వాత యూజర్లు ట్విటర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్ట్స్ ఆధారిత తాజా పోస్టు చేయడానికి ఉపయోగిస్తున్న ట్విటర్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

Meta
Meta New App: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ఉద్యోగులతో పాటు యూజర్లకు షాక్ ఇస్తున్నారు. ఎలాన్ మస్క్ ప్రవేశపెడుతున్న కొత్త విధానం, చెల్లింపు సేవ వంటి అనేక దశల తర్వాత యూజర్లు ట్విటర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్ట్స్ ఆధారిత తాజా పోస్టు చేయడానికి ఉపయోగిస్తున్న ట్విటర్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
Twitter: మస్క్ కొత్త నిర్ణయం.. ట్వీట్ లిమిట్ 208 నుంచి 10,000లకి జంప్
మెటా సోషల్ మీడియా కొత్త యాప్ గురించి కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై కంపెనీ స్పందిస్తూ.. మేము టెక్ట్స్ అప్‌డేట్‌లను భాగస్వామ్యం చేయడంకోసం స్వతంత్ర వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్‌ను అన్వేషిస్తున్నాము. యూజర్లు వారి ఆసక్తుల గురించి సమయానుకూలైన అప్‌డేట్‌లను పంచుకునే ప్రత్యేక ప్లేస్ కోసం అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నామని కంపెనీ పేర్కొంది. అయితే, మెటా ప్రారంభించే ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, చట్టపరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Meta Layoffs: మళ్లీ ఉద్యోగాల కోతకు రెడీ అవుతున్న మెటా.. వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం
ఎలాన్ మస్క్ ట్విటర్ ను స్వాధీనం చేసుకున్న కొద్ది నెలల్లోనే అనేక ప్రత్యర్థి ప్లాట్ ఫారమ్‌లు ప్రారంభించబడ్డాయి. గతేడాది డిసెంబర్ లో ఇన్ స్టాగ్రామ్ నోట్స్ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు కేవలం టెక్ట్స్, ఎమోజీలను ఉపయోగించి 60 అక్షరాల వరకు చిన్న పోస్టులను షేర్ చేయడానికి అనుమతిస్తుంది. మరోవైపు ఈనెల ప్రారంభంలో ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే తన ట్విటర్ ప్రత్యామ్నాయ బ్లూస్కీని ప్రారంభించడంతో సోషల్ మీడియా గేమ్‌లోకి తిరిగి వచ్చారు. ఇది పరీక్ష దశలో యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.