మన భూమిపై నీరు ఎలా పుట్టింది? ఉల్కలే భూగ్రహానికి నీటిని తీసుకొచ్చాయా!

మన భూమిపై నీరు ఎలా పుట్టింది? ఉల్కలే భూగ్రహానికి నీటిని తీసుకొచ్చాయా!

Meteorites may have brought water to Earth : మన గ్రహంపై అసలు నీరేలా వచ్చిందో తెలుసా? భూగ్రహంపై నీటి ఆవిర్భావానికి వెనుక దాగిన రహాస్యాన్ని ఖగోళ సైంటిస్టులు బయటపట్టేశారు. భూమిపై నీటి ఆవిర్భావానికి ఉల్కలే కారణమంటున్నారు. ఈ మధ్యకాలంలోనే ఉల్కలు భూమిపైకి తీసుకొచ్చాయంట.. కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితమే భూమిపైకి వచ్చిన ఉల్కల్లో ద్రవపు నీరు ఉండి ఉండొచ్చునని అంటున్నారు. ఇటీవల భూమిపైకి వచ్చిన కొన్ని ఉల్కల ఆధారంగా గతంలోనే నీటి ఆవిర్భావానికి కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. మన గ్రహం ఉపరితలంపై ఈ అంతరిక్ష శిలలే నీటిని తీసుకొచ్చినట్టు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.

ఒకప్పుడు ఉల్కలు భూమికి నీటిని తీసుకువచ్చాయని చాలా మంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ గత విశ్లేషణలతో పోలిస్తే.. ఈ ఉల్కల్లో ద్రవపు నీటితో కూడిన కెమికల్ రియాక్షన్ బిలియన్ సంవత్సరాల క్రితమే ఆగిపోయి ఉండొచ్చునని సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని మాక్వేరీ యూనివర్శిటీలో (Simon Turner) ఆయన తోటి సైంటిస్టులు గత శతాబ్దంలో భూమిపైకి వచ్చిన 9 ఉల్కలను లోతుగా విశ్లేషించారు. ఈ ఉల్కలు ఒకప్పుడు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గ్రహశకలాలుగా గుర్తించారు.

ఒక ఉల్కలోని మంచు కరిగినప్పుడు.. నీరు ద్రవంలోకి మారిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఉల్కలోని మంచు భాగం కరిగిపోయి ఒక భాగం నుంచి మరొక భాగానికి కదులుతాయంట. యురేనియం నీటిలో కరుగుతుంది. కానీ థోరియం అలా కాదు.. యురేనియం, థోరియం ఐసోటోపుల పంపిణీ ద్వారా పరిశోధకులు నీటి ఆధారాలను అంచనా వేయొచ్చు.

యురేనియం, థోరియంలో చాలా తక్కువ జీవం మనుగడ ఉంటుంది. గత మిలియన్ సంవత్సరాలలో జరిగిన సంఘటనలను మాత్రమే రికార్డ్ అవుతాయని టర్నర్ చెప్పారు. యురేనియం, థోరియం నమూనాల ఆధారంగా గత మిలియన్ ఏళ్లలో ఉల్కలు ద్రవ నీటితో కూడిన కెమికల్ రియాక్షన్స్ జరిగి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలోనే ఉల్కలు భూమికి నీటితో కూడిన సేంద్రీయ సమ్మేళనాలను తీసుకొచ్చి ఉండవచ్చునని చెబుతున్నారు. గ్రహశకలాల నుంచి నేరుగా తీసిన నమూనాలను విశ్లేషించడం ద్వారా పరీక్షించవచ్చనని పేర్కొన్నారు.