Me Too in china : టీవీ హోస్ట్‌పై న‌మోదైన మీటూ కేసును కొట్టివేసిన బీజింగ్ కోర్టు

చైనాలో సంచలనం కలిగించిన మీటూ కేసును బీజింగ్ కోర్టు కొట్టివేసింది. ప్రముఖ టీవీ హోస్ట్‌పై న‌మోదైన లైంగిక వేధింపుల కేసును బీజింగ్ కోర్టు కొట్టివేసింది.

Me Too in china  : టీవీ హోస్ట్‌పై న‌మోదైన మీటూ కేసును కొట్టివేసిన బీజింగ్ కోర్టు

China Court Dismisses Landmark Sex Harassment Case

china me too sex harassment case : చైనాలో సంచలనం కలిగించిన మీటూ కేసును బీజింగ్ కోర్టు కొట్టివేసింది. ప్రముఖ టీవీ హోస్ట్‌పై న‌మోదైన లైంగిక వేధింపుల కేసును బీజింగ్ కోర్టు నిరాక‌రించింది. లైంగిక వేధింపులు జరిగినట్లుగా తగిన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. ప్రముఖ టీవీ హోస్ట్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావటం అప్పట్లో చైనాలో పెను సంచలనం అయ్యింది. 2014లో నమోదు అయిన ఈ కేసును బీజింగ్ కోర్టు తాజాగా కొట్టివేసింది.

జువో జియాజున్ అనే మ‌హిళ .. సీసీటీవీ హోస్ట్ జూ జున్‌పై కేసు వేసింది. తాను ఇంటెర్న్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో అత‌ను తనను లైంగికంగా వేధించాడని తనకు ఇష్టం లేక ప్రతిఘటిస్తున్నా జూ జున్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని జువో జియాజున్ అనే మ‌హిళ త‌న ఫిర్యాదు చేసింది.పలు సందర్భాల్లో జూ తనను బ‌ల‌వంతంగా శరీరాన్ని తాకేవాడ‌ని..ముద్దులు పెట్టుకోవటమే కాకుండా తన శరీరాన్ని ఎక్కడెక్కడో తాకేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో చైనాలో మీటూ ఉద్య‌మం గురించి చాలా అవ‌గాహ‌న పెరిగింది.

Read more: Khushbu: కమిట్‌మెంట్ అడిగిన హీరోకు ఖుష్బూ దిమ్మతిరిగే ఆన్సర్!

కాగా 2014లో జున్ వేధించాడ‌ని జియాజున్ 2018లో ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లు త‌మ ఫిర్యాదుల‌ను న‌మోదు చేసేందుకు ఈ కేసు స‌హ‌క‌రించింది. అయితే లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌ను సీసీటీవీ హోస్ట్ జున్ ఖండించారు. తనపై అన్యాయంగా ఆమె ఆరోపణలు చేస్తోందని తన పరువు తీయటానికే ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేసిందంటూ ఆ ఆరోపణల్ని జున్ తీవ్రంగా ఖండించాడు.ఈ ఫిర్యాదుపై విచారణలు కొనసాగించిన కోర్టు తాజాగా మంగళవారం తుది విచారణ చేపట్టిన సందర్భంగా (సెప్టెంబర్ 14,2021)ఈ కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటు కొట్టివేసింది.

Read more: Me Too: దర్శకుడికి సమన్లు..

దీంతో జియాజున్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. కోర్టు తీర్పు వెలువడిన తరువాత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతు..తీవ్ర భావోద్వేగానికి గురైంది. “న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాను.కానీ నాకు నిరాశే ఎదురైంది. నేను ఇకపై ఏమీ చేయలేనని నాకు అనిపిస్తోంది … అంటూ కన్నీటి పర్యంతమైంది.కాగా చైనాలో ఇటీవలే లైంగిక వేధింపులను స్పష్టంగా నిర్వచించే చట్టాన్ని ఆమోదించింది. అయినా బాధితురాలికి సాక్ష్యాలు లేవనే కారణంతో నిరాశే మిగిలింది.

Read more : Me Too: వాళ్లను నగ్నంగా నిలబెట్టకపోతే నేను మా నాన్న కూతురినే కాను..