Accident : వాహనదారులపైకి దూసుకొచ్చిన ట్రక్.. 20 మంది దుర్మరణం

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవడంతో టోల్‌బూత్‌లోకి దూసుకొచ్చింది.

Accident : వాహనదారులపైకి దూసుకొచ్చిన ట్రక్.. 20 మంది దుర్మరణం

Accident

Accident :  మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవడంతో టోల్‌బూత్‌లోకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్ అక్కడున్న వాహనాలను ఢీకొంది దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని 20 మంది సజీవదహనమయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Car Accident : ముహూర్తం బాగోలేదు…కొన్న గంటకే కారు యాక్సిడెంట్

బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ కూడా అక్కడిక్కకడే మృతి చెందాడు. ఇక గత కొద్దీ రోజులుగా వరుసగా ట్రక్ ప్రమాదాలు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. నవంబర్ 1 నుంచి ఇది ఐదో దుర్ఘటన.

చదవండి : Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం