Bill gates divorce : బిల్‌గేట్స్‌ దంపతుల విడాకులకు కారణం ఆ వ్యక్తేనా..?!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు..ప్రపంచ కుబేరుడు..బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. గ్రేట్స్ దంపతుల 27ఏళ్ల వివాహ బంధానికి బీటలు బారటానికి ఓ వ్యక్తే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

Bill gates divorce : బిల్‌గేట్స్‌ దంపతుల విడాకులకు కారణం ఆ వ్యక్తేనా..?!

Bill Milenda Gates Divorce

bill gates divorce : మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు..ప్రపంచ కుబేరుడు..ప్రపంచ బిజినెస్ టైకూన్ బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ జంట విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది.గ్రేట్స్ దంపతుల 27ఏళ్ల వివాహ బంధానికి బీటలు బారటానికి ఓ వ్యక్తే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం సడెన్ గా తీసుకున్నది కాదనీ..ఓ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఓ కథనం ప్రచురించింది. బిల్ గేట్స్ నుంచి విడిపోవాలని మిలిండా గేట్స్‌ 2019లోనే తీసుకున్నారా? అప్పటి నుంచే ఆమె విడాకుల న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే.. అవుననే ఆ కథనం అంటోంది.

ద గ్రేట్ బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు వారి మూడు దశాబ్దాల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు గేట్స్ దంపతులు ప్రకటించారు. దీనిపై గేల్స్ దంపతులు కారణం గురించి నోరు విప్పకపోయినా..ఓ వ్యక్తి వల్లే వీరు విడాకుల నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రముఖ జర్నల్ వాల్​స్ట్రీట్​.. బిల్​గేట్స్​తో మిలిందా విడాకులు తీసుకోవడానికి గల కారణంపై ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా నిర్ధారణ అయి శిక్ష పడిన వ్యక్తితో బిల్​​ సన్నిహితంగా మెలగడమే వీరి విడాకులకు కారణమని పేర్కొంది. వీరి సన్నిహిత సంబంధాలను మిలిండా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా బిల్ వినలేదనీ..కథనంలో ఉంది.

బిల్ సన్నిహితంగా మెలిగిన ఆ వ్యక్తి మరెవరో కాదు. ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి ఆరోపణలపై 2019లో ఎప్‌స్టీన్ అరెస్ట్ అయ్యాడు. ఇలా నేరారోపణలు గల వ్యక్తితో బిల్ సాన్నిహిత్యం కొనసాగించడం మిలిందాకు నచ్చలేదు. గేట్స్ దంపతుల మధ్య పలుమార్లు ఈ విషయమై చిన్నపాటి ఘర్షణలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో శిక్ష పడిన వ్యక్తితో బిల్‌గేట్స్‌ సన్నిహితంగా మెలగడంపై మిలిందా తీవ్ర అభ్యంతరం తెలిపారు. అతనితో కలిపి రాత్రి అంతా గడపటం మిలిండాకు అస్సలు నచ్చలేదు. పదే పదే చెప్పినా బిల్ వినలేదని..అయితే ఎప్‌స్టీన్‌తో తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నానని బిల్‌గేట్స్‌ గతంలో భార్యకు వివరణ కూడా ఇచ్చారు.కానీ మిలిండా మాత్రం అతనితో సంబంధాలు మనకు వద్దని కచ్చితంగా చెప్పారు. కానీ బిల్ మాత్రం కొనసాగించారు. 2013 నుంచి ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్‌ కలుస్తూనే వచ్చారు. కానీ ఎప్‌స్టీన్‌ చనిపోయినా బిల్ గ్రేట్స్ విడాకులకు మాత్రం అతనే కారణమని అతనే బలమైన కారణమని తెలుస్తోంది.

ఇలా వారి చక్కటి వివాహ బంధం సన్నగా బీటలుబారటానికి ఎప్ స్టీన్ కారణమయ్యాడు. అది అలా అలా పెరిగాయి. అదే కారణంతో బిల్‌తో విడిపోవాలని మిలిందా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని మిలిందా 2019లోనే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచే ఆమె విడాకులకు సంబంధంచి న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది.

దీని ప్రకారం లైంగిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలే వివాహబంధం తెగిపోవడానికి కారణమైందని బలంగా తెలుస్తోంది. ఇక వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌.. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. న్యాయస్థానంలో కేసు విచారణలో దశలో ఉండగానే అదే ఏడాది జైల్లోనే ఎప్‌స్టీన్‌ మృతిచెందాడు. కానీ అతను ప్రాణాలతో లేకపోయినా గ్రేట్స్ దంపతుల విడాకులకు అతనే కారణమైనట్లుగా తెలుస్తోంది.