వైట్ హౌస్‌ని తాకిన కరోనా, తొలి కేసు నమోదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 05:11 AM IST
వైట్ హౌస్‌ని తాకిన కరోనా, తొలి కేసు నమోదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని చేసే ఓ ఉద్యోగి కరోనా బారిన పడ్డాడు. దేశంలో కరోనా పరస్థితిని సమీక్షిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. అధ్యక్షుడు ట్రంప్ తో కానీ, పెన్స్ తో కానీ వైరస్ సోకిన వ్యక్తి నేరుగా సంప్రదించిన సందర్భాలు లేవని పెన్స్ కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్ తెలిపారు. ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలడంతో వైట్ హౌస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ ఉద్యోగిని ఇటీవలి కాలంలో కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. 

కరోనా పరీక్షలు చేయించుకున్న ట్రంప్:
గతవారం ట్రంప్ కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన కలిసిన పలువురు ప్రముఖులకు వైరస్ నిర్ధారణ కావడంతో వైద్య పరీక్షలు చేయించుకోక తప్పలేదు. దీంతో అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది.. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సామాజిక దూరం(సోషల్ డిస్టెన్స్) పాటించేలా కార్యాలయంలో సీటింగ్ ఆరేంజ్ మెంట్ లో మార్పులు చేశారు.

See Also | జనతా కర్ఫ్యూ : జనాల పరుగులు

అమెరికాలో 18వేల కరోనా కేసులు, 230 మరణాలు:
కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 230కి చేరడంతో అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. గత 50 గంటల్లో 10 వేల కొత్త కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18 వేలు దాటింది. ఇప్పటికే నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపి కరోనా మహమ్మారితో పోరాడుతోంది. న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వాషింగ్టన్ లో అత్యధికంగా 74మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజారవాణాపై కూడా కఠిన ఆంక్షలు విధించారు.

ప్రపంచవ్యాప్తంగా 11వేల 385మంది మృతి:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 75వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7వేల 479 మంది పరిస్థితి విషమంగా ఉంది. 11వేల 385మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

కరోనా మృతుల్లో చైనాను దాటిన ఇటలీ:
కరోనా మరణాల్లో చైనాను దాటిపోయింది ఇటలీ. ఇటలీలో ఒక్క రోజులోనే 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 4వేల 32కి చేరింది. చైనాలో 3వేల 248 మంది చనిపోయారు. స్పెయిన్, ఇరాన్ లోనూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. స్పెయిన్ లో 1,093 మంది, ఇరాన్ లో 1433 మంది, ఫ్రాన్స్ లో 372మంది చనిపోయారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 218కి చేరింది. కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మృతుల సంఖ్య 11వేలకు దాటడం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది.