హైబ్రిడ్ దోమలు తయారు చేస్తున్న సైంటిస్టులు.. ఇవి అస్సలు కుట్టవ్

హైబ్రిడ్ దోమలు తయారు చేస్తున్న సైంటిస్టులు.. ఇవి అస్సలు కుట్టవ్

ఫ్లోరిడా 750మిలియన్ దోమలకు స్థావరమైంది. వీటన్నిటినీ జెనటికల్ గా మార్పు చేసి హైబ్రిడ్ గా మార్చి ప్రజావాసాల్లోకి విడుదల చేస్తున్నారట. స్థానిక ప్రభుత్వాలు దీనికి ఆమోదం కూడా తెలిపేశాయంట. దోమలు కుట్టి మన రక్తాన్ని పీల్చేయడంతో పాటు విసుగు, దురద పుట్టిస్తాయి. అంతే కాదు. వీటి వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి. డెంగ్యూ జ్వరం, జికా లాంటి వైరస్ లు ఇతరుల రక్తం పీల్చి మనల్ని కుట్టడంతో వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

చాలా దోమలు నిద్రపోతున్నప్పుడే కుడుతుంటాయి. అవన్నీ నీటి నిల్వలు ఉన్న చోటే ఉంటాయి. నీటి ఉపరితలాలపైనే గుడ్లు పెట్టి లార్వాలను పొదుగుతుంటాయి. వాటిని అడ్డుకోవడం సాధారణంగా కుదరని పని. అందుకే ఆ తలాలపై జెనెటికల్ గా మార్పులు చేసిన దోమలను విడుదల చేసి వాటి స్థానాలను ఆక్రమించేలా చేస్తున్నారు.

ఫలితంగా సాధారణ దోమలకు స్థావరాలు లేకుండాపోనున్నాయి. దాదాపు 750 మిలియన్ దోమలకు జెనెటికల్ మార్పులు చేసి విడుదల చేస్తున్నారు. ఇవన్నీ మగ దోమలే. ఇవి అసలు కుట్టవన్నమాట. ఎందుకంటే ఆడ దోమలు గుడ్లు పెట్టడం కోసం మనుషుల్ని కుట్టి న్యూట్రియెంట్స్ పోగు చేసుకుంటాయి. పబ్లిక్ హెల్త్ కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలలో ఇదొకటి.

అమెరికాలో పనిచేస్తున్న బ్రిటిష్ కంపెనీ వీటిని తయారుచేసింది. స్థానికంగా వ్యతిరేకత 2లక్షల 40వేల మంది దీనికిసపోర్ట్ ఇచ్చారు. ఇలా చేయడం తొలిసారేం కాదు. బ్రెజిల్ లోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు. సంవత్సరాల నుంచి మోడిఫైడ్ దోమలను విడుదల చేస్తున్నారు. వీటి వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదాలు ఉండవు అని ఆక్సిటెక్ సైంటిస్ట్ మీడియాతో అన్నారు.